ప్లీజ్.. నన్ను బతికించండి.. ఆ సినిమా చూసి చనిపోతా!

Mana Enadu: క్యాన్సర్(Cancer).. ఈ పేరు వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి(Serious Disease)గా చాలా మంది భావిస్తుంటారు. మన శరీరంలోని కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల.. కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణ సమూహాలను ‘కంతి’ (టూమర్, Tumor) అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని క్యాన్సర్‌గా నిర్ధారిస్తారు వైద్యులు. వీటి పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు. తాజాగా ఓ యువకుడు ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే తాను చనిపోయేలోపు తన అభిమాన నటుడి(Actor) సినిమా చూసి చనిపోవాలని కోరుతున్నాడు. ఇంతకీ ఆ బాలుడు ఎవరు. అతడి దీనస్థితి ఏంటో తెలుసుకుందామా..

ఆంధ్రప్రదేశ్‌(AP)లోని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో కాంట్రాక్ట్‌ డ్రైవర్‌‌(Driver)గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్‌(Koushik). ఇతడు గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్‌‌(Blood Cancer)తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం కౌశిక్‌ చివరి స్టేజీ క్యాన్సర్‌‌తో బాధ పడుతున్నట్లుగా వైద్యులు చెప్పారట. అయితే ఆ యువకుడు జూనియర్ ఎన్టీఆర్‌కు (Junior NTR) వీరాభిమాని. కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌(Blood Cancer)తో బాధ పడుతున్నాడు. అయితే తాను చనిపోయే లోపు తన అభిమాన హీరో మూవీ ‘దేవర’ (Devara) చూసి చనిపోవాలని ఆకాంక్షించాడు. ఈ క్రమంలో తమ బిడ్డ ఆఖరి కోరిక తీర్చాలని ఆ యువకుని తల్లిదండ్రులు(Parents) కన్నీటితో వేడుకుంటున్నారు. ప్రస్తుతం బెంగుళూరులోని కిడ్‌వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కౌశిక్ తల్లిదండ్రులు తిరుపతి (Tirupati) ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘నా కుమారుడు చిన్నప్పటి నుంచి Jr. NTRకు వీరాభిమాని. ఇప్పుడు కూడా చివరి కోరికగా ‘దేవర’ సినిమా చూడాలని అడుగుతున్నాడు. SEP 27 వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. ఇది అతని ఆఖరి కోరిక.’ అంటూ కౌశిక్ తల్లి సరస్వతి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుని వైద్యానికి రూ.60 లక్షలు ఖర్చవుతుందని.. ప్రభుత్వం, దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు. తమ కొడుకు చివరి కోరిక తీర్చాలని తాము ప్రయత్నిస్తున్నామని.. తమకు AP CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమకు సాయం చేయాలని కోరుతున్నారు.

 

 

Share post:

లేటెస్ట్