ManaEnadu:మేఘా ఆకాశ్.. నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. చెన్నైకి చెందిన ఈ భామ ఆ తర్వాత చల్ మోహన రంగ, డియర్ మేఘ, పేట, గుర్తుందా శీతాకాలం, ప్రేమ దేశం, మను చరిత్ర, రావణాసుర వంటి సినిమాల్లో నటించింది. ఈ భామకు టాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు ఏం రాకపోయినా.. బబ్లీ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. తనకంటూ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.
అయితే మేఘ తర్వలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. తన ప్రియుడు సాయి విష్ణుతో ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే తనకు కాబోయే భర్తతో కలిసి వివాహ పత్రికలు పంచుతోంది. ఇందులో భాగంగా తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇంటికి వెళ్లింది ఈ జంట. తలైవా ఆశీర్వాదం తీసుకుని తమ పెళ్లికి రావాలని ఆహ్వానించింది.
ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టంట వైరల్ అవుతున్నాయి. కంగ్రాట్స్ డియర్ మేఘ అంటూ నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మేగ రజినీ కాంత్ తో కలిసి పేట మూవీలో నటించిన విషయం తెలిసిందే. మేఘా ఆకాశ్ సాయి విష్ణు అనే రాజకీయ నేత కుమారుడితో గత ఆరేళ్లుగా ప్రేమలో ఉంది. కేరళలో జరిగిన ఈ జంట నిశ్చితార్థం ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా మేఘ విజయ్ ఆంటోనీతో కలిసి ‘తుఫాన్’ (తెలుగు) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో చివరిగా ‘మను చరిత్ర’ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళం ఇండస్ట్రీలో బిజీగా ఉంది. ఎక్కువగా తమిళ సినిమాలు చేస్తోంది. తెలుగులో ‘వికటకవి’, ‘సహకుటుంబం’ సినిమాలు చేస్తోంది. అయితే పెళ్లి తర్వాత కూడా మేఘ సినిమాల్లో నటిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.