Nani:నాని సినిమాలో జాన్వీ కపూర్.. క్లారిటీ ఇచ్చిన నేచురల్ స్టార్

ManaEnadu:బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్.. అతిలోకసుందరి శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా తన టాలెంట్​తో అవకాశాలు సొంతం చేసుకుంటోంది. మిగతా స్టార్ కిడ్స్​లా కాకుండా జాన్వీ వర్సటైల్ సినిమాలు చేస్తోంది. ప్రతి సినిమా డిఫరెంట్ జానర్​లో ఉండేలా జాగ్రత్త పడుతోంది. అందుకే ఈ భామ సినిమాలకు సక్సెస్ రేట్ కాస్త ఎక్కువగా ఉంది. ఇక ఇటీవలే ఈ బ్యూటీ ఉలఝ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో నాలుగైదు చిత్రాలతో బిజీబిజీగా గడుపుతోంది.

ఇక బాలీవుడ్​లోనే కాదు టాలీవుడ్​లోనూ జాన్వీ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే ఈ బ్యూటీ ముందు అరడజనుకుపైగా అవకాశాలు వచ్చాయి. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్​తో కలిసి దేవర, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్​తో బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మరోవైపు నానితో కూడా ఓ చిత్రంలో నటించే అవకాశం కొట్టేసిందని టాక్.

తాజాగా దీనిపై నాని స్పందించాడు. సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్ కోసం ముంబయి వెళ్లిన నాని అక్కడ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన నెక్స్ట్ మూవీలో జాన్వీ నటిస్తోందన్న వార్తల గురించి హోస్టు ప్రశ్నించగా.. అది కేవలం రూమర్ మాత్రమే అని నాని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆమెను సినిమాలో తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చని చెప్పాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి స్క్రిప్టు వర్క్ జరుగుతోందని తెలిపాడు. తాను కొన్ని రోజులుగా వరుస షూటింగులతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా గురించి అప్డేట్స్ ఏం తెలుసుకోలేకపోయానని వెల్లడించాడు. ఒకవేళ నాని తర్వాత సినిమాకు జాన్వీ గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే తెలుగులో ఆది ఆమెకు మూడో సినిమా అవ్వబోతోంది.

ఇక సరిపోదా శనివారం సినిమా సంగతికి వస్తే నాని నటిస్తున్న ఈ సినిమాకు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్​గా నటిస్తుండగా.. ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​లో చిత్రబృందం బిజీబిజీగా ఉంది.

Share post:

లేటెస్ట్