Indra : ఇంద్ర సాంగ్ మేకింగ్ వీడియో.. స్పెషల్ అట్రాక్షన్ గా రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్

ManaEnadu:మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సినిమా రూపొందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఇంద్ర చిత్రానికి సంబంధించి తరచూ ఓ అప్డేట్ ఇస్తోంది. తాజాగా ఈ సినిమాలో చిరు-ఆర్తి అగర్వాల్ మధ్య వచ్చే అమ్మడూ అప్పచ్చీ పాట మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

స్పెషల్ అట్రాక్షన్ గా మెగా పవర్ స్టార్.. 

ఈ వీడియోలో అమ్మడూ అప్పచ్చీ సాంగ్ ను షూట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంద్ర సినిమా సమయంలో మెగాస్టార్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారని ఈ వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది. ఇక ఈ పాటకు రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు. సెట్ లోనే స్టెప్పులు చేసి చూయిస్తుంటే చిరు వెంటనే ఆ స్టెప్స్ నేర్చేసుకుని సాంగ్ షూటింగ్ లో పాల్గొన్నట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్ కనిపించారు.

వైష్ణవ్ తేజ్ ను చూశారా..

చిరంజీవి హాలిడేస్ సమయంలో తన పిల్లలను షూటింగ్ స్పాట్ కు తీసుకెళ్లేవాడినని చాలా సార్లు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పాట షూటింగ్ సమయంలో కూడా చిరు వెంట ఆయన పిల్లలున్నట్లు కనిపిస్తోంది. చిరు డ్యాన్స్ చేస్తుంటే రామ్ చరణ్ అలా చూస్తూనే ఉండిపోయినట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక వైష్ణవ్ తేజ్ కూడా చిరు స్టెప్స్ కి మెస్మరైజ్ అయిపోయాడు. ప్రస్తుతానికి ఈ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది.

ఇక ఇంద్ర సినిమా సంగతికి వస్తే ఇది చిరంజీవి సినిమాలోనే బ్లాక్ బస్టర్ హిట్. చిరుకి పెద్ద కమర్షియల్ హిట్ అందించిన సినిమా ఇది. ఈ సినిమాను బి గోపాల్ తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించారు. ఇందులో చిరుకు జోడీగా సొనాలీ బింద్రే, ఆర్తి అగర్వాల్ నటించారు. ప్రకాశ్ రాజ్, ఆహుతి ప్రసాద్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. 

Share post:

లేటెస్ట్