బిగ్​బాస్​లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఈసారి ఎవరెవరి మధ్య అంటే?

ManaEnadu:బిగ్​బాస్ (Bigg Boss)​ రియాల్టీ షో అంటేనే టాస్కులు, గొడవలు, అల్లర్లు, అరుచుకోవడాలు మధ్యమధ్యలో కాస్త కామెడీ. అప్పుడప్పుడూ లవ్ ట్రాక్​తో కొంచెం రొమాన్స్ కామన్. ప్రతి సీజన్​లో ఈ లవ్ ట్రాక్ మాత్రం పక్కా. అయితే ఈసారి బిగ్​బాస్ తెలుగు సీజన్ 8 మొదలై ఒకవారం గడిచిపోయింది. ఒక ఎలిమినేషన్ (బెజవాడ బేబక్క) కూడా అయిపోయింది. అయినా ఇప్పటికీ లవ్ ట్రాక్ ఊసే లేదు. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మాత్రం లవ్ ట్రాక్ కనిపిస్తోంది.

బిగ్​బాస్​లో ఈసారి కూడా ప్రేమాయణం (Love Track) పక్కా ఉంటుందని జనాలు అంటున్నారు. అయితే ఈ ట్రాక్ ఇద్దరి మధ్యా లేక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవుతుందో అన్నది తేలాలి. అయితే ప్రోమో చూసిన తర్వాత నెటిజన్లు కచ్చితంగా ట్రయాంగిల్ లవ్ ట్రాక్ ఉంటుందని చెబుతున్నారు. ఇంతకు ముందు సీజన్లలో ఈ ట్రయాంగిల్ ట్రాకులు (Triangle Love Track) నడిచిన విషయం తెలిసిందే. మరి తాజా సీజన్​లో ఈ ట్రాక్ ఎవరెవరి మధ్య ఉండబోతోంది అంటే?

సీజన్-8లో హౌజులో పృథ్వీ, నిఖిల్ (Nikhil), సోనియా మధ్య ట్రయాంగిల్ లవ్​ స్టోరీ నడిచే అవకాశం ఉందని నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. తాజా ప్రోమోలో వీళ్లు మాట్లాకుంటున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్​లో వచ్చిన పాటలు, మ్యూజిక్.. వీళ్ల మధ్య లవ్ ట్రాక్ ఉంటుందనే హింట్ ఇచ్చిందని నెటిజన్లు అంటున్నారు. “నిజమైన ప్రేమలో ఫ్రీడమ్ ఉండాలి” అని విష్ణుప్రియ అనగా.. ఆ సమయంలో సోనియా.. పృథ్వీ (Prithvi) హ్యాండ్​ని పట్టుకుని క్యూట్​గా బిహేవ్ చేస్తున్న ఫుటేజీ చూపించారు. “పృథ్వీ ఎంతమందికైనా ప్రేమను పంచొచ్చు”అని విష్ణు మరో పంచ్ వేయడంతో కంటెస్టెంట్లు అందరూ నవ్వేశారు.

ఆ తర్వాత నిఖిల్ దగ్గర కూర్చున్న సోనియా (Sonia).. “నువ్వు సిగరెట్ తాగకుండా ఉండరా.. ఏమడిగినా ఇస్తా” అని బంపర్ ఆఫర్ ఇవ్వడంతో నిఖిల్ ఒక్కసారిగా షాక్​ అయ్యాడు. ఆ సమయంలో ప్రోమో (Bigg Boss Promo)లో ఓ లవ్ ట్రాక్​ను బ్యాక్‍గ్రౌండ్​లో ప్లే చేశారు. సోనియా సిగ్గుపడుతుండగా.. నిఖిల్ మీసాలు మెలేస్తూ నవ్వులు చిందించాడు. ఇక అప్పుడు మరో కంటెస్టెంట్ సీత.. “దే ఫౌండ్ ఈచ్​ అదర్” అని ఓ కామెంట్ చేయగా.. “గాడ్ మస్ట్​ బి క్రేజీ అంటే ఇదే” కౌంటర్ వేస్తూ “చూసేవన్నీ నిజాలు కాదం”టూ మరో పంచ్ వేశాడు అభయ్.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *