Mana Enadu: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్(50 Years Of Cine Industry) హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ మెగా ఈవెంట్‌ను తెలుగు సినీ ఇండస్ట్రీ చాలా గ్రాండ్‌గా నిర్వహించింది. టాలీవుడ్(Tollywood)తోపాటు ఇతర సినీ పరిశ్రమల ప్రముఖులు,అగ్ర నటీనటులు తరలివచ్చారు. తెలంగాణ CM రేవంత్ రెడ్డి, Megastar చిరంజీవి, రజనీకాంత్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు విక్టరీ వెంకటేశ్, శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, శ్రీకాంత్, గోపీచంద్, నాని, దగ్గుబాటి రానా, సిద్ధు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఇక డైరెక్టర్ల(Directors)లో గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను(Boyapati Srinu) కూడా ఈవెంట్లో మెరిశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి బాలకృష్ణను శాలువాతో సత్కరించారు. బాలయ్య కుటుంబ సభ్యులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వేడుకకు హాజరయ్యారు. ఇక బాలయ్య 50 ఏళ్ల నట ప్రస్థానంపై సినీప్రముఖులు ఏమన్నారంటే..
➥ బాలయ్యబాబు 50 సంవత్సరాల వేడుకలో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది బాలకృష్ణకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుక. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. NTRకు ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు. మాతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. తాను ‘ఇంద్ర(Indra)’ మూవీ చేయడానికి బాలకృష్ణ (Balakrishna) ‘సమరసింహారెడ్డి’ ఆదర్శమని అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అన్నారు. బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ (Faction Movie) మూవీ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి.
➥ బాలకృష్ణ బాల్యం నుంచీ నటుడిగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు. 500 రోజులకుపైగా సినిమా ప్రదర్శితమవడమనే ఘనత ఆయనదే. హిందూపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలవడం సంతోషంగా ఉందని సీనియర్ నటుడు మోహన్ బాబు(Mohan Babu) అన్నారు.
➥ NTR కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బాలకృష్ణ. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. 50 సంవత్సరాల మీ ప్రయాణం ఎంతో మంది కొత్తవారికి ఆదర్శమని హీరో విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) కొనియాడారు.
➥ తెలుగు చిత్ర పరిశ్రమ అంత కలిసి ఇలా వచ్చినందుకు అభినందిస్తున్నాను. 110 సినిమాలు చేయడం చాలా కష్టం, 50 సంవత్సరాలు సినిమాలు చేసినందుకు అభినందనలు. మీకు ఓపిక ఉన్నంత వరుకు, ఊపిరి ఉన్నంత వరకు మీరు సినిమాలు చేయాలి. మేమంతా మీతో ఉంటాం. జై బాలయ్య (Jai Balayya) అనేది ఒక మంత్రం, అందులో ఉన్నంత ఎనర్జీ ఇంకా ఎక్కడా ఉండదు అని డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) అన్నారు.
➥ నేను బాలయ్య గారితో రెండు సినిమాలలో నటించాను.ఆయన నాకు తెలిసినంత వరకూ చాలా సింపుల్. మనస్ఫూర్తిగా మాట్లాడతారు. ఆయన ప్రయాణం ఆదర్శనీయం. ఆయన సినీ, రాజకీయ రంగాలలో ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నానని నటి సుమలత చెప్పారు.
➥ సంస్కారం వల్ల అందరూ గుర్తు పెట్టుకునే వ్యక్తి బాలయ్య. ఆయనకు తండ్రి, దైవం, గురువు ఎన్టీఆర్. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వం. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో బాగుండాలని నటుడు కమల్‌హాసన్ వీడియో ద్వారా సందేశం పంపారు.
➥ వీరితోపాటు నటుడు మంచు విష్ణు, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, నాని, అల్లరి నరేశ్, అడవి శేష్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, డైరెక్టర్లు బుచ్చిబాబు, అనిల్ రావిపూడి ఏపీ మంత్రి కందు దుర్గేశ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ భరత్ తదితరులు బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని కొనియాడారు.