సింగర్​గా చిట్టి.. మత్తు వదలరా-2లో పాట పాడిన ఫరియా అబ్దుల్లా

ManaEnadu:’చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. పట్టుమని నవ్విందా నీ గుండె ఖల్లాసే’.. అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది మన చిట్టి. అదేనండి.. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది.. ఇచ్చేండి సార్ … ఇచ్చేయండి అన్న ఒక్క డైలాగ్​తో కుర్రాళ్ల మనసులో తిష్ట వేసుకుని కూర్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. ఇప్పటికీ జాతిరత్నాలు మూవీలోని చిట్టి క్యారెక్టరే టాప్​లో ఉంది. ఇక ఈ భామ తాజాగా నటించిన సినిమా మత్తు వదలరా(Mathu Vadalara).

శ్రీసింహా కోడూరి నటించిన మత్తు వదలరా మూవీకి సీక్వెల్​గా మత్తు వదలరా-2 (Mathu Vadalara2) వస్తోంది. రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ ఎంటర్​టైనర్​లో శ్రీసింహాకు జోడీగా ఫరియా అబ్దుల్లా కూడా నటిస్తోంది. సెప్టెంబర్ 13వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ టీజర్​ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ (Mathu Vadalara Teaser) రిలీజ్ ఈవెంట్​ను హైదరాబాద్​లో నిర్వహించారు. ఈ ఈవెంట్​లో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా తన ఫ్యాన్స్​కు ఓ క్రేజీ న్యూస్ చెప్పింది.
మత్తు వదలరా చిత్రంతో ఫరియా సింగర్​గా ఆకట్టుకోబోతందట. ఈ సినిమాలో ఓ పాటను స్వయంగా రాసిన ఫరియా ఆ పాటను తానే పాడిందట. అంతే కాకుండా ఆ సాంగ్​కు కొరియోగ్రఫీ కూడా తనదేనట. ఈ వీడియో సాంగ్​ కోసం తాను ఎంతగానో ఎదురూచూస్తున్నానని చెప్పుకొచ్చింది ఈ భామ. తెరపై ఆ పాటను చూసి ప్రేక్షకులు తప్పకుండా ఫిదా అవుతారని చెబుతోంది. ఇక తాను వర్క్ చేసిన టీమ్స్​లో ఈ సినిమా టీమ్ ది బెస్ట్ అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది.
ఇక ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న శ్రీసింహా (Sree Simha) మాట్లాడుతూ.. ‘‘మత్తు వదలరా’తో నేను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను. మళ్లీ 5 ఏళ్ల తర్వాత దాని సీక్వెల్‌కు వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. ఫస్ట్‌ పార్ట్‌కు థియేటర్‌లోనే కాకుండా ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించింది. దీని సీక్వెల్‌ను అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని చెప్పారు.

Share post:

లేటెస్ట్