ManaEnadu:టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నట ప్రస్థానానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన తొలి చిత్రం ‘తాతమ్మ కల’ 1974 ఆగస్టు 30న విడుదలైంది. ఈ నేపథ్యంలో బాలయ్య సినీ స్వర్ణోత్సవాన్ని టాలీవుడ్ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో సెప్టెంబర్ 1వ తేదీన భారీ స్థాయిలో ఈ వేడుకను జరపనుంది. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులను ఈ వేడుక (Nandamuri Balakrishna Silver Jubilee)కు ఆహ్వానించింది. ఇక టాలీవుడ్లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ తన లైఫ్‌లో చేయాలనుకున్న డ్రీమ్ రోల్స్ ఏంటి? ఆయన డ్రీమ్ ప్రాజెక్టు ఏంటో తెలుసుకుందామా?
జై బాలయ్య
నందమూరి బాలకృష్ణ.. అభిమానులు బాలయ్య బాబు అని ప్రేమగా పిలుచుకుంటారు. ఆయన పేరు వింటే చాలు థియేటర్లో పూనకాలే. థియేటర్, పబ్, ఫంక్షన్ ఏదైనా జై బాలయ్య అనే నినాదం ఉండాల్సిందే. ఏ ఈవెంట్ అయినా జై బాలయ్య స్లోగన్‌తో ఎండ్ అవాల్సిందే. అలా నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి జై బాలయ్య (Jai Balayya) ప్రేక్షకుల చేత పూనకాలు పెట్టించే స్థాయికి చేరుకునేందుకు ఎంతో కృషి చేశారు.
టాక్ ఏదైనా కలెక్షన్ల జోరు..
యాక్షన్, రొమాన్స్, ఫ్యాక్షన్, ఎమోషనల్ డ్రామా, సోషియో ఫాంటసీ, జానపద, సైన్స్ ఫిక్షన్.. ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక హీరోగా బాలకృష్ణ రికార్డు సృష్టించారు. ఇక వసూళ్లలో ఈ హీరో సినిమాలకు పోటీ ఎవరూ లేరు. బాలయ్య సినిమా అంటే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడతారు. సినిమా హిట్టా యావరేజా.. టాక్ ఏదైనా.. బాలయ్య సినిమా అంటే థియేటర్లోనే చూడాలని ఆడియెన్స్ భావిస్తుంటారు. అందుకే ఆయన సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అదిరిపోతాయి. ఇక అన్ని జానర్లలో అన్నిరకాల పాత్రలు పోషించి సంపూర్ణ నటుడిగా పేరు పొందిన బాలయ్య కెరీర్లో కొన్ని డ్రీమ్ రోల్స్ (Balakrishna Dream Roles) ఉన్నాయట. అలాగే ఓ డ్రీమ్ ప్రాజెక్టు కూడా ఉంది.
బాలయ్య డ్రీమ్ రోల్స్..
చరిత్రలోనే అతి పెద్ద సామ్రాజ్యంగా పేరొందిన మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు చంఘీజ్ ఖాన్ (Genghis Khan) పాత్రలో నటించాలని ఉందని బాలయ్య బాబు ఎప్పుడూ చెబుతుంటారు.కాకతీయ రాణి రుద్రమ దేవికి విధేయుడై, రహస్యంగా ఆమె పాలనకు మద్దతిస్తూ, ఎల్లవేళలా రాజ్యాన్ని కాపాడటం కోసం ఎంతో కృషి చేసిన గోన గన్నారెడ్డి (Genghis Khan) పాత్రలో నటించాలని బాలయ్య చిరకాల కోరిక. అలాగే హిందూమత భక్తి ఉద్యమకారుడు, సిద్ధాంతకర్త శ్రీరామానుజాచార్య పాత్రలో కనిపించాలనేది కూడా ఆయన కోరికల్లో ఒకటి.
బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్
ఇక బాలయ్య బాబు డ్రీమ్ ప్రాజెక్టుల్లో మొదటిది ‘నర్తనశాల’ (Nartanasala). ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించాలని కాస్త షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ఇందులో అలనాటి తార, సౌందర్యను కూడా తీసుకున్నారు. అలాగే విలక్షణ నటుడు రియల్ స్టార్ శ్రీహరి కూడా ఇందులో భాగమయ్యారు. కానీ కొన్నేళ్ల క్రితం మొదలైన ఈ ప్రాజెక్టు, సౌందర్య, శ్రీహరిల అకాల మరణంతో కనుమరుగైపోయింది. వాళ్లు లేకుండా ఈ చిత్రాన్ని తీయలేనని బాలయ్య ఈ సినిమాను పక్కన బెట్టేశారు. ఇక ఇదే కాకుండా ఓ సూపర్ స్టార్‌తో ‘రైతు (Rythu)’ అనే సినిమాను తెరకెక్కించాలనేది కూడా బాలకృష్ణ డ్రీమ్.






