COURT : ‘కోర్టు’లో ప్రియదర్శి.. నాని ‘వాల్​ పోస్టర్’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ

ManaEnadu:నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో ఆగస్టు 29వ తేదీన థియేటర్లలో సందడి చేశారు. పాజిటివ్ టాక్​తో ఈ చిత్రం దూసుకెళ్తోంది. నాని ఖాతాలో మరో హిట్ పడినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికే దసరా, హాయ్ నాన్నలతో హిట్లు ఇచ్చిన ఈ స్టార్.. ఇప్పుడు సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ కొట్టాడు. ఇలా ఓవైపు హీరోగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే నాని నిర్మాతగా కూడా దూసుకెళ్తున్నాడు.

వాల్ పోస్టర్ సినిమా (Wall Poster Cinema) అనే ప్రొడక్షన్​ను స్టార్ చేసిన నాని.. ఈ నిర్మాణ సంస్థలో ఇప్పటికే హనుమాన్ ఫేం డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో అ!, టాలీవుడ్ బెస్ట్ థ్రిల్లర్స్​లో ఒకటే హిట్ ఫ్రాంచైజీ హిట్, హిట్-2 (HIT 2) నిర్మించాడు. ఇక డిజిటల్ ప్లాట్​ఫామ్​లోనూ ఎంట్రీ ఇచ్చి మీట్ క్యూట్ (Meet Cute) అనే ఆంథాలజీని నిర్మించాడు. ఇక ఇప్పుడు నాని తన నిర్మాణ సంస్థ నుంచి మరో ఆణిముత్యాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇవాళ (ఆగస్టు 30) వాల్ పోస్టర్ సినిమా నిర్మాణ సంస్థ నుంచి ఓ కొత్త సినిమాను ప్రకటించాడు.

ఇటీవల డార్లింగ్ (Darling Movie) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​కు హాజరైన నాని మాట్లాడుతూ.. ఆ సినిమా హీరో ప్రియదర్శితో తన నిర్మాణ సంస్థలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఆ సినిమా టైటిల్​ను రివీల్ చేస్తూ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ప్రియదర్శి హీరోగా.. నాని నిర్మాతగా.. రామ్ జగదీశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పేరు కోర్టు (COURT Movie). స్టేట్ వర్సెస్ ఏ నో బడీ అనేది ట్యాగ్ లైన్.

ఈ పోస్టర్ లో కోర్టు బోనులో న్యాయ దేవత విగ్రహం నిలబడి కనిపిస్తుంది. మోషన్ పోస్టర్ చూస్తుంటే సినిమా సీరియస్ కోర్ట్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్యాగ్​లైన్ (స్టేట్ వర్సెస్ నో బడీ (State Vs A Nobody)) చూస్తుంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి చేసే ఒంటరిపోరాటంలా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి నాని మరో మంచి కాన్సెప్టుతో వస్తున్నాడని.. ప్రియదర్శి (Priyadarshi) ఖాతాలో మరో వర్సటైల్ సినిమా పడబోతోందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కోర్టు రూమ్​లో ఏ డ్రామా జరగబతోందో చూడాలంటే కొన్నాళ్లు ఎదురుచూడాల్సిందే.

 

Share post:

లేటెస్ట్