Mathu Vadalara 2:వెల్‌కమ్‌ టు ‘హీ’ టీమ్‌.. ‘మత్తు వదలరా 2’ టీజర్‌ అదిరిపోయింది

ManaEnadu:ఆస్కార్ అవార్డు విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) చిన్న తనయుడు శ్రీసింహా కోడూరి (Sir Simha) టాలీవుడ్​లో పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. మత్తు వదలరా చిత్రంతో ఈ నటుడు తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్​గా వచ్చిన ఈ సినిమా అప్పుడు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఇక తాజాగా మేకర్స్ ఆ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు.

‘మత్తు వదలరా-2 (Mathu Vadalara 2)’ అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో శ్రీసింహా హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్​గా, సత్య ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా 2 సినిమా సెప్టెంబర్ 13వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్​​ను ఇవాళ (ఆగస్టు 30వ తేదీ) విడుదల చేశారు.

‘వెల్​కమ్ టు హీ టీమ్ (He Team)’ అంటూ సాగిన ఈ టీజర్​ ఆద్యంతం నవ్వులు పూయించింది. ‘హీహీహీహీ.. హీ టీమా’ అని ఒకతనంటే.. అన్ని హీలు లేవంటూ హీరో శ్రీసింహా, కమెడియన్ సత్య చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ‘డ్రగ్స్ కావాలా.. పెద్ద పెద్ద హేమాహేమీలే దొరికిపోయార్రా’ అంటూ సత్య చెప్పిన మరో డైలాగ్.. ఇటీవల హైదరాబాద్​, బెంగళూరులో చోటుచేసుకున్న ఘటనలపై సెటైర్ వేసినట్లుగా ఉంది.

‘డెలివరీ బాయ్​గా చేసినా.. స్పెషల్ ఏజెంట్​గా చేసినా.. మనకు జీతం సరిపోదేంట్రా’ అంటూ శ్రీసింహ చెప్పిన డైలాగ్ నేటి యువతరానికి బాగా కనెక్ట్ అవుతుంది. చేసేదంతా నువ్వే చేస్తావ్.. అటిటైతే నన్నంటావ్ అంటూ సత్య ఫ్రస్ట్రేషన్​లో చెప్పే డైలాగ్ కూడా బాగుంది. ఇక ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, రోషిణి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఆద్యంతం అలరించిన ఈ చిత్రం టీజర్​ను మీరూ ఓసారి చూడండి.

Share post:

లేటెస్ట్