ManaEnadu:కథలు ఎంచుకోవడంలో సుహాస్ తనదైన శైలి చూపిస్తాడు..సుహాస్ సినిమా మినిమమ్ హిట్ గ్యారంటీ అనే ముద్ర వేసుకున్నాడు. ఈక్రమంలో మిడల్ క్లాస్ అబ్బాయిగా కుటుంభాన్ని ఎలా నెట్టుకొచ్చాడో ‘జనక అయితే గనక’ అనే మూవీని దిల్ రాజ్ నిర్మించారు. సెప్టెంబర్ 7న చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
హీరో సుహాస్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా నుంచి ‘నా ఫేవరేట్ నా పెళ్లాం’ సాంగ్‌ను లాంచ్ చేశారు.హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘‘ముందు ఈ స్టోరీని నాకు వినిపించిన హర్షిత, హన్షితకి దన్యవాదాలు తెలిపారు. చాలా మంచి స్టోరీ. మా అందరికీ సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చిన దిల్‌రాజుకి పెద్ద థాంక్స్. మా డైరెక్టర్ సందీప్ జీవితంలో మరచిపోలేని సినిమానిచ్చారు. మా హీరోయిన్ సంగీర్తన సినిమా తర్వాత అందరికీ నచ్చేస్తుంది మంచి సంగీతాన్నిచ్చిన విజయ్ బుల్గానిన్, రాసిన కెకె సహా అందరికీ థాంక్స్’’ అన్నారు.
తండ్రికి ఉండే కష్టాలను అందరం ప్రతి ఇంట్లో చూస్తాం.కానీ ప్రతీ ఇంట్లో ఉండేదే హ్యాపీగా ఉండే కష్టాలను మాత్రం జనక అయితే గనక సినిమాలో చూడాల్సిందేనని దిల్‌రాజు అన్నారు. సుహాస్ కంటే ముందు చాలా మంది ఈ కథను విన్నారు. అందరూ ఎగ్జయిట్ అయ్యారు. కానీ అమ్మో! మేం చేస్తే ఎలా ఉంటుందో అని అన్నారు. బలగం రిలీజ్ తర్వాత నేనే ఓ రోజు సందీప్, హర్షిత్‌లను పిలిచాను. సుహాస్‌తో చేస్తే బావుంటుందని చెప్పాను. తనైతే కథతో రీచ్ అవుతాడనిపించిందన్నాను.

వెంటనే వాళ్లు కూడా బావుంటుందన్నారు. మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు వచ్చి ఆడుతున్నప్పుడు మాకొక కిక్ వస్తుంది. అలాంటి స్క్రిప్టే ఇది. మిడిల్ క్లాస్ అబ్బాయి.. తనకొచ్చే జీతంతో హ్యాపీగా ఉంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు వద్దనుకుంటాడు. ఎందుకు పిల్లలు వద్దనుకుంటున్నావని ఎవరైనా అడిగితే అందరికీ లెక్కలు చెప్పి నోరు మూయిస్తుంటాడు. ఈరోజుల్లో ఉన్న జనరేషన్‌లో డబ్బులు అవసరమే, ఎమోషన్స్ కూడా అవసరమే. డైరెక్టర్ సందీప్ తన రియల్ లైఫ్‌లో చూసిన ఇన్సిడెన్స్‌ను బేస్ చేసుకుని కథను తయారు చేశాడు






