Jaya Krishna : జూనియర్​ సూపర్​ స్టార్​ ఎలా ఉన్నాడో చూశారా?

ManaEnadu:ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో యువ హీరో టాలీవుడ్‌కి పరిచయంం కానున్నాడు. సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని త్వరలోనే టాలీవుడ్‌కు హీరోగా ఎంట్రీ అవ్వబోతున్నాడు.

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ హీరో టాలీవుడ్‌కి పరిచయం కానున్నాడు. సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు (Ramesh Babu) తనయుడు జయకృష్ణ (Jaya Krishna) ఘట్టమనేని త్వరలోనే టాలీవుడ్‌కు హీరోగా పరిచయం కానున్నారని గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా జయకృష్ణకు సంబంధించిన ఓ ఫొటో షూట్‌ బయటకు రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇటీవల ఆయన ఫ్యామిలీ ఫంక్షన్ లో సందడి చేశారు. అక్కడ బ్లాక్‌సూట్‌లో మెస్మరైజింగ్‌లో లుక్‌లో కనిపించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

జయకృష్ణ ఇప్పటికే అమెరికాలో యాక్టింగ్‌ కోర్స్‌ పూర్తి చేసి, డాన్స్ తదితర అంశాలపై పట్టు సాధిస్తున్నారు. తాతయ్య కృష్ణ, తండ్రి రమేష్‌బాబు, బాబాయ్‌ మహేష్‌బాబు (mahesh babu) చరిష్మాను కొనసాగించడానికి, హీరోయిక్‌ క్వాలిటీస్‌ అన్నింటి మీద పరిపూర్ణంగా పట్టు సాధించి ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడట. ఇప్పటికే జయకృష్ణ కొన్ని స్టోరీ లైన్స్ విన్నారని తెలిసింది. త్వరలోనే తెలుగులో పేరొందిన దర్శకుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేయబోతున్నారని తెలిసింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *