Naga Chaitanya-Sobhita: చైతూ-శోభిత వివాహం.. ఎప్పుడు.. ఎక్కడ? అక్కినేని ఫ్యామిలీ ప్లాన్ ఏంటి?

Mana Enadu: సమంతతో విడాకుల అనంతరం కొన్ని రోజులు సింగిల్‌గా ఉన్న అక్కినేని నాగచైతన్య ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. హీరోయిన్ శోభితా ధూళిపాళతో చైతూ ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. సమంతతో రిలేషన్‌కు పుల్‌స్టాప్ పెట్టిన ఈ అక్కినేని వారసుడు.. కొన్నేళ్లుగా శోభితతో ప్రేమలో ఉన్నాడు. ఇటీవల తమ ప్రేమ విషయాన్ని అఫిషీయల్‌గా బయట పెట్టాడు. ఆగస్టు 8న హైదరాబాద్‌లోని అక్కినేని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.

దీంతో అప్పటి నుంచి చైతన్య, శోభితల నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఎక్కడ చూసినా వీరి వార్తలే కనిపిస్తున్నాయి. అయితే నిశ్చితార్థం తర్వాత చైతన్య, శోభిత మళ్లీ తమ తమ ఫ్రొఫెషనల్‌ లైఫ్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. పెండింగ్‌లో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు శోభిత-చైతూ వివాహంపై ఇటీవల నాగార్జున మాట్లాడుతూ కొన్ని కారణాలతో అనుకోకుండా ఎంగేజ్మెంట్ జరిగిందని, అయితే పెళ్లికి మాత్రం కొంచెం సమయం పడుతుందన్నారు. ఇదిలా ఉండగా చైతన్య, శోభితల వివాహంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ లేదా రాజస్థాన్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇవి కుదరకపోతే విదేశాల్లోనూ గ్రాండ్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో చైతూ-శోభితల వివాహం జరిగే అవకాశం ఉందని వారి సన్నిహితులు చెబుతున్నారు.

 డేటింగ్‌లో సమంత.. రూమర్స్ నిజమేనా?

మరోవైపు దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‌లో ఉందంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ముంబైలో ఆమె తన కారులో కూర్చుని ఫోన్‌లో మాట్లాడుతున్న ఫొటోలు బయటకు వచ్చి వైరల్ అయ్యాయి. రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే కలిసి ‘రాజ్ అండ్ డీకే’గా కలిసి సినిమాలు చేస్తుంటారు. వీరితో కలిసి సమంత గతంలో ‘ఫ్యామిలీమ్యాన్’ సిరీస్‌లో పనిచేసింది. ప్రస్తుతం మళ్లీ వారి కాంబినేషన్‌లోనే ‘సిటాడెల్: హనీ బన్నీ’ చేస్తుండటంతో దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్‌లో ఉందన్న వార్తలు వైరల్ అయ్యాయి.

ఆ పోస్ట్ అందుకోసం కాదట..

తాజాగా ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర పోస్ట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన హీరోయిన్ సమంత తాజాగా మరో పోస్ట్ చేశారు. వరల్డ్ పికిల్ బాల్ లీగ్‌లో ఆమె భాగస్వామ్యమైనట్లు వెల్లడించారు. తాను చెన్నై ఫ్రాంచైజీకి ఓనర్ అని ప్రకటించారు. చైతూ రెండో పెళ్లి, డైరెక్టర్‌తో లవ్‌లో ఉన్నట్లు వస్తోన్న వార్తల నేపథ్యంలో ఆమె ఏ విషయంపై స్పందిస్తారో అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ తన కొత్త వ్యాపారం గురించి ఆమె చెప్పారు.

https://x.com/iamnagarjuna/status/1821450886238851531

Share post:

లేటెస్ట్