Most Awaited Telugu Films: బాబోయ్.. ‘దేవర’ క్రేజ్ మామూలుగా లేదుగా!!

Mana Enadu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Ntr) హీరోగా, కొరటాల శివ(korata shiva) డైరెక్షన్‌లో వస్తోన్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ దేవర(Devara). ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటీ జాన్వీ(janvi) కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్‌ ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా.. సాంగ్స్‌కు డాన్స్ మాస్టర్‌ గణేశ్‌ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రిలీజ్ అయిన ‘‘చుట్టమల్లె’’ సాంగ్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దేవర’ పార్ట్‌ 1 సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది.

అత్యంత ఆసక్తి ఈ మూవీలపైనే..

ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ‘ORMAX’ త్వరలో విడుదల కానున్న, ట్రైలర్ విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలపై ఓ సర్వే చేసింది. ఇందులో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తెలుగు సినిమాలను ప్రముఖ మీడియా సంస్థ ‘ORMAX’ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ తర్వాత విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్న, ట్రైలర్ రిలీజ్ కాని సినిమాలపై సంస్థ సర్వే చేసింది. ఇందులో ఎన్టీఆర్ నటిస్తోన్న ‘దేవర’ సినిమా కోసం ఎక్కువ మంది ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో ‘పుష్ప-2’, OG, స్పిరిట్, జై హనుమాన్ సినిమాలున్నాయి. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

 పుష్ప-2 సిద్ధమవుతోంది..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జోడీగా సుకుమార్ డైరెక్షన్‌లో రానున్న సినిమా పుష్ప-2. దాదాపు ఈ సినిమా కోసం అభిమానులు రెండున్నర ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను ఆగస్ట్ 15, 2024 నుంచి డిసెంబర్ 6, 2024కి వాయిదా పడింది. ఈ మూవీలో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా తీరిక లేకుండా ఉన్నారు. అయితే తాను కమిటైన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలను త్వరగా పూర్తి చేయాలని పవన్ చూస్తున్నారు.

 అంజనాద్రికి స్వాగతం..

ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తోన్న మూవీ స్పిరిట్. ఈ చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి సిన్సియర్ పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం నిదానంగా జరుగుతోంది. ఇక తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. తాజా హనుమాన్ పార్ట్ 2 కోసం ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ మొదలైనట్లు ప్రశాంత్ వర్మ చెప్పారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో “అంజనాద్రి 2.0‌కి స్వాగతం” అంటూ క్యాప్షన్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ భారీ స్థాయి సినిమాలన్నీ విడుదలైతే అభిమానులకు పండగే.

https://x.com/OrmaxMedia/status/1825776311496737237

Share post:

లేటెస్ట్