Mana Enadu: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో సూపర్ హిట్ అయిన చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. దీనికి ఇది ఒక కారణమైతే.. తమ హీరోల అప్పటి సినిమాలు చూడలేకపోయామే అని ఫీలవుతున్న ఫ్యాన్స్‌కు మరోసారి వినోదం అందించడం ఓ రీజన్. ప్రస్తుతం టావీవుడ్‌లోనే కొనసాగుతోన్న రీరిలీజ్‌ల ట్రెండ్ తాజాగా ఇతర ఇండస్ట్రీలకు కూడా పాకింది. తమిళం, కన్నడతో పాటు తాజాగా బాలీవుడ్ పరిశ్రమకు కూడా పాకింది. ఈ జాబితాలో తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘మైనే ప్యార్ కియా’ మూవీ చేరింది. ఆగస్టు 23న ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు ఈ సినిమాని నిర్మించిన నిర్మాణ సంస్థ రాజశ్రీ ఫిలిమ్స్ అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ చేసింది.
హీరోగా సల్మాన్ ఎంట్రీ ఈ సినిమాతోనే..
మైనే ప్యార్ కియా.. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. 1989లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. ఈ సినిమాను చూసే కొందరు లవ్‌లో పడి పెళ్లి చేసుకునారనే వార్తలు అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమాలో సల్మాన్ రొమాటిక్ హీరోగా నటించి ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయమైంది భాగ్యశ్రీ. ఆ రోజుల్లోనే వన్ క్రోర్ పెట్టి ఈ సినిమాను నిర్మించారు. దీంతో ఏకంగా 28 కోట్లు వసూల్ చేసిందీ లవ్ కమ్ రొమాంటిక్ మూవీ. ఇక ఈ సినిమా పాటలు అయితే ఇప్పటికి కూడా బోర్ కొట్టవు.
తెలుగులో ప్రేమ పావురాలు
మైనే ప్యార్ కియా సినిమా కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలోని అన్ని ప్రదేశాల్లో కూడా బాగా ఆడింది. తెలుగులో ఈ సినిమా ప్రేమ పావురాలు పేరుతో రిలీజయి ఇక్కడ కూడా ఏకంగా 200 రోజులకు పైగా ఆడి పెద్ద హిట్ అయింది. 35 ఏళ్ల తర్వాత మైనే ప్యార్ కియా సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇండియా అంతటా ఈ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. దీంతో సల్మాన్ ఫ్యాన్స్ తో పాటు ఈ సినిమా అభిమానులు కూడా మరోసారి థియేటర్స్ లో ఈ సినిమా చూడటానికి రెడీ అయిపోయారు.