Chiranjeevi Birthday: చిరంజీవి బర్త్ డే.. సెలబ్రేషన్స్‌లో తగ్గేదేలే!!

Mana Enadu: టాలీవుడ్ మెగాస్టార్, పద్మవిభూషన్ అవార్డు గ్రహీత, లక్షలాది అభిమానులకు ఆరాధ్య హీరో చిరంజీవి. ఎల్లుండి ఆయన బర్త్ డే కావడంతో ఆ హంగామా సోషల్ మీడియాలో మోతెక్కుతోంది. మరోవైపు మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలు నుంచి కూడా మేకర్స్ రకరకాల అప్డేట్స్ ఇస్తున్నారు. అందులో భాగంగా చిరంజీవి నటిస్తున్న విశ్వంభర నుంచి సాలిడ్ అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు ఇటు కుటుంబ సభ్యులు, అటు అభిమానులు భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి (Chiranjeevi Birthday) బర్త్ డేను రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగలా నిర్వహిస్తామని ఫ్యాన్స్ ఇప్పటికే ప్రకటించారు.

 శిల్పకళావేదికలో రేపు వేడుకలు

ఇదిలా ఉండగా రేపు హైదరాబాదులో చిరంజీవి మెగా బర్త్ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం శిల్పకళావేదికలో రేపు (ఆగస్టు 21) సాయంత్రం 5.04 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మెగా బర్త్ డే ఈవెంట్ లో అనేక సర్ ప్రైజ్‌లు ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. ప్రస్తుతం ‘విశ్వంభర’తో సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే దీని తర్వాత చిరు చేయనున్న ప్రాజెక్ట్‌ ఏదన్నది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు మోహన్‌రాజా దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. నిర్మాతగా చిరు తనయ సుస్మిత కొణిదెల వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది.

 ఎల్లుండి ‘ఇంద్ర’ రీరిలీజ్..

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఇంద్ర ఒకటి. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన కెరీర్లోనే బిగ్టెస్ట్ హిట్లలో ఒకటైన ‘ఇంద్ర’ను రీ రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్లో ఎన్నో రీ రిలీజ్‌లు చూశాం. ఇందులో ప్రత్యేకత ఏముంది అనిపించవచ్చు. కానీ ఇప్పటిదాకా వచ్చిన అన్ని రీరిలీజ్‌ల కంటే ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడమే కాదు.. అవన్నీ హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి. పెట్టిన షోలు పెట్టినట్లు సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి.

Share post:

లేటెస్ట్