ManaEnadu:కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క” (KA). ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ (world of Vasudev) ను రిలీజ్ చేశారు. ఈ పాట హీరో కిరణ్ అబ్బవరం వాసుదేవ్ క్యారెక్టరైజేషన్ ను ఆవిష్కరించింది. ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ పాటకు సనాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాయగా..సామ్ సీఎస్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు. ‘ఏ మొదలు తుదలు లేని ప్రయాణం. ఏ అలుపూ సొలుపు లేని విహారం. ఏ చెరలు తెరలు తెలియని పాదం..ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం,నిన్న మొన్న ఉన్న నన్ను చూశారా..వెన్ను దన్ను అంటూ ఏముంది. ఒంటరివాడినని అంటారా నాతో పాటు ఊరుంది…’ అంటూ హీరో వాసుదేవ్ పాత్రను ప్రతిబింబిస్తూ ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ పాట సాగుతుంది.
ఈ చిత్రంలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.