కన్నప్పలో ‘అవ్రామ్‌ మంచు’ లుక్‌ చూశారా!.. సో క్యూట్​

ManaEnadu:మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెలుగు తెరపై సందడి చేయడానికి వస్తున్న విషయం తెలిసిందే. మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కుమారు అవ్రామ్ భక్త టాలీవుడ్​లో ఎంట్రీ ఇస్తున్నాడు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కన్నప్పలో అవ్రామ్ నటిస్తున్నాడు. ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా ఈ సినిమాలో అవ్రామ్ లుక్​ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఈ చైల్డ్ స్టార్ తిన్నడు అనే పాత్రలో నటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. మంచువిష్ణు చిన్నప్పటి పాత్రను ఇందులో అవ్రామ్‌ పోషించనున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టర్‌ను మోహన్‌ బాబు పోస్ట్‌ చేసి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పారు.

ఈ పోస్టర్​లో అవ్రామ్ కాళీ మాత విగ్రహం ముందు నిల్చొని గర్జిస్తున్నట్లుగా పోజు ఇచ్చినట్లు కనిపిస్తోంది. అవ్రామ్‌కు ఇది తొలి సినిమా కావడంతో నెటిజన్లు బెస్ట్ విషెస్ తెలియ జేస్తున్నారు. సో క్యూట్ అంటూ సో స్వీట్ అంటూ ఈ చైల్డ్ ఆర్టిస్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా సంగతి ఎలా ఉన్నా అవ్రామ్ సీన్లు మాత్రం అదిరిపోతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బుజ్జి కన్నప్ప అంటూ క్యూట్ క్యూట్ ఎమోజీలు పోస్టు చేస్తున్నారు.

‘కన్నప్ప’ విషయానికొస్తే.. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచు విష్ణు టైటిల్‌ పాత్రలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీని మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో.. ప్రభాస్, అక్షయ్‌ కుమార్, శరత్‌కుమార్, మోహన్‌లాల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్‌ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. ఇటీవల టీజర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా ప్రారంభంలో కన్నప్ప మూవీ గురించి మంచు విష్ణు మాట్లాడుతూ.. ఇది తన డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పారు. ఈ సినిమా తన బిడ్డతో సమానం అని తెలిపారు. ఒక నటుడిగా ఈ చిత్రం తనకు గౌరవాన్ని పెంచుతుందని.. కెరీర్‌ పరంగా తన జీవితాన్ని మార్చేస్తుందని వెల్లడించారు. ఇందులో చాలామంది అగ్ర నటీనటులు ఉన్నారని.. వాళ్లందరితో కలిసి నటించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు.

Share post:

లేటెస్ట్