Mister Celebrity :గ‌ణేష్ మంట‌పాల్లో ఇక జోష్‌.. ‘గజానన’ పాటలో వరలక్ష్మీ స్టెప్పులు అదుర్స్‌..

ManaEnadu:సుదర్శన్ పరుచూరి (Paruchuri Sudarshan)హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా రాబోతోంది. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ వినాయకుడి నామస్మరణే వినిపిస్తోంది. వినాయక చవితి స్పెషల్‌గా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి ఓ హుషారైన దైవ భక్తి గల పాటను రిలీజ్ చేశారు. ‘గజానన’ అంటూ సాగే ఈ పాటను మంగ్లీ పాడారు. గణేష్ రాసిన ఈ పాటకు వినోద్ ఇచ్చిన బాణీ ఎంతో హుషారుగా అనిపించింది. ఇక ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఈ పాట భ‌క్తుల‌కు ప్ర‌త్యేక జోష్ తీసుక‌రానుంది.

గజానన అంటూ సాగే ఈ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. చాలా రోజుల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంత ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో సాంగ్‌ని చూస్తుంటే నిజంగానే ఉత్సవం జరిగినట్టు అనిపిస్తోంది. తెరపై ఈ పాట కచ్చితంగా ఓ పండుగలా ఉండబోతోందనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని ఎన్. పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *