ManaEnadu: నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)’. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులకు ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది చిత్రబృందం. ఇక ప్రమోషనల్ ఈవెంట్స్‌తో మరింత హైప్ క్రియేట్ చేసింది. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ సూపర్ న్యూస్ చెప్పారు మేకర్స్.
జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్..
సరిపోదా శనివారం సినిమా అడ్వాన్స్ బుక్కింగ్స్ (Saripodhaa Sanivaaram Advanced Bookings) జోరుగా సాగుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ నానికి సూపర్ క్రేజ్ వస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఆడియెన్స్ నాని సినిమా చూడ్డానికి ఉవ్విళ్లూరుతున్నారట. అక్కడ నానికి ఉన్న క్రేజు ఈ సినిమా బుకింగ్స్ చూస్తే అర్థమైపోతోంది.
ఓవర్సీస్ లో నాని క్రేజు..
‘సరిపోదా శనివారం’ ఓవర్సీస్ ప్రీమియర్లకు భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ తెలిపారు. అక్కడి బుకింగ్ ద్వారా ఏకంగా 17,000కు పైగా ప్రీమియర్ టికెట్లు అమ్ముడైనట్లు చెప్పారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగినట్లు సమాచారం. ఇప్పుడు అమెరికాలో వసూళ్లను కూడా కలుపుకుంటే సినిమా కోట్ల వర్షం కురిపిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. అలా నాని (Actor Nani Latest Movie) సినిమా రిలీజ్ కు ముందే సూపర్ బిజినెస్ చేస్తోందన్నమాట.
నానికి హ్యాట్రిక్ ఖాయం!
దసరా, హాయ్ నాన్న (Hi Nanna Movie) సినిమాలతో వరుస హిట్లు అందుకున్న నాని ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టబోతున్నాడని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఈ సినిమా బిజినెస్ బాగానే సాగనున్నట్లు కనిపిస్తోంది. దీంతో నాని హ్యాట్రిక్ ఖాయమని నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ సినిమాలో నానితో పాటు, ఎస్ జే సూర్య, ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 29వ తేదీన ఈ చిత్రం (Saripodhaa Sanivaaram Release Date) రిలీజ్ కాబోతోంది.