Mana Enadu: చూస్తుండగానే ఆగస్టు మంత్ గడిచిపోయింది. ఈ నెలలో బాక్సాఫీస్ వద్ద చిన్నా పెద్ద హీరోల సినిమాలు చాలా సందడి చేశాయి. అయితే అందులో కొన్ని భారీ కలెక్షన్లు రాబడితే.. మరికొన్ని డిజాస్టర్‌గా మిగిలిపోయాయి. చిన్న సినిమాలూ సైతం భారీ వసూళ్లనే కొల్లగొట్టాయి. అటు బాలీవుడ్‌లోనూ డజన్ల కొద్దీ కొత్త సినిమాలు ఆగస్టు(August)లోనే విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాలన్నింటినీ OTTలు బుక్ చేసుకున్నాయి. ఇప్పటికే ఈ నెలలో KALKI 2898 AD, రాయన్, భారతీయుడు-2, టర్బో సహా చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి వచ్చేశాయి. ఇదే క్రమంలో సెప్టెంబర్‌లోనూ మరిన్ని మూవీలు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. అందులో టాలీవుడ్(Tollywod)లో భారీ క్రేజ్ సంపాదించిన నాలుగు చిత్రాల కోసం అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. బిజీ లైఫ్ కారణంగా థియేటర్లలో చూడని ఈ సినిమాలను ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా ఇంట్లోనే చూసేందుకు ఆరాటపడుతున్నారు.. ఇంతకీ ఏంటా చిత్రాలు.. తెలుసుకుందాం పదండి…
డబుల్ ఇస్మార్ట్ (Double Ismart)
రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా, డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannath) కాంబోలో వచ్చిన మూవీ ‘‘డబుల్ ఇస్మార్ట్’’. ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అభిమానుల హైప్‌ను అందుకోలేకపోయింది. సూపర్ హిట్ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ కావటంతో చాలా క్రేజ్ ఏర్పడినా దానిని అందుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డబుల్ ఇస్మార్ట్ బోల్తా కొట్టింది. కాగా డబుల్ ఇస్మార్ట్ చిత్రం స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోస్ దక్కించుకుంది. సెప్టెంబర్ మూడో వారం లేకపోతే నాలుగో వారం ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చే ఛాన్స్ ఉంది. డబుల్ ఇస్మార్ట్ మూవీలో కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్‍గా నటించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay dutt) విలన్ పాత్ర పోషించారు. ఈ మూవీకి మ్యూజిక్ మ్యాస్ట్రో మణిశర్మ సంగీతం అందించారు.
మిస్టర్ బచ్చన్ (Mr Bacchan)
ఎన్నో అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. మాస్ మహారాజ్ రవితేజ(RaviTeja) హీరోగా నటించిన ఈ మూవీ ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకు వచ్చింది. హరీశ్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రీమియర్ షోల నుంచే మిక్స్డ్ టాక్‍తో చతికిలపడింది. కాగా మిస్టర్ బచ్చన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకుంది. రూ.33కోట్లకు ఈ మూవీ హక్కులను తీసుకున్నట్టు సమాచారం. సెప్టెంబర్ రెండో వారంలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) హీరోయిన్‍గా నటించింది.
కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu)
కమిటీ కుర్రోళ్ళు తక్కువ బడ్జెట్ చిత్రంగా వచ్చిన మంచి హిట్టు కొట్టింది. మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) ప్రొడ్యూస్ చేసిన తొలి మూవీతోనే సక్సెస్ సాధించారు. ఈ చిత్రం ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైంది. మొదటి నుంచి పాజిటివ్ టాక్‍తో దూసుకెళుతోంది. యధు వంశీ(Yadu Vamshi) దర్శకత్వం వహించిన ఈ రూరల్ కామెడీ డ్రామా చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ సహా మరికొందరు లీడ్ రోల్స్ చేశారు. కమిటీ కుర్రోళ్ళు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్(Etv Win) ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందని ఇటీవలే సమాచారం బయటికి వచ్చింది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఆయ్ (Aay)
ఆయ్ మూవీ అంచనాలకు మించి సూపర్ హిట్ అయింది. నార్నే నితిన్(Narne Nitin) హీరోగా నటించిన ఈ రూరల్ కామెడీ మూవీ రూ.15 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. ఈ చిత్రంలో నితిన్ సరసన నయన్ సారిక(Nayan Sarika) హీరోయిన్‍గా నటించారు. ఆయ్ చిత్రానికి అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించగా.. జీఏ2 పిక్చర్స్ పతాకం నిర్మించింది. ఈ సినిమా డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకుంది. వచ్చే నెల సెప్టెంబర్ మూడో వారంలో స్ట్రీమింగ్‍కు వచ్చే ఛాన్స్ ఉంది.