ManaEnadu:దసరా, హాయ్ నాన్న (Hi Nanna) వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నేచురల్ స్టార్ నాని హ్యాట్రిక్ కొట్టేందుకు తాజాగా ‘సరిపోదా శనివారం (Saripoda Sanivaram)’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంటే సుందరానికి మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కలిసి నాని చేసిన రెండో మూవి ఇది. ఈ సినిమాలో దర్శకుడు, నటుడు ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించారు. నానితో కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఈ చిత్రంలో మరోసారి నేచురల్ స్టార్‌తో జతకట్టింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులకు ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (ఆగస్టు 29) సరిపోదా శనివారం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ షోస్ జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా సందడి షురూ అయింది. ప్రీమియర్ షో సినిమా చూసిన వాళ్లు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నాని హ్యాట్రిక్ కొట్టేశాడహో అంటూ సోషల్ మీడియాలో ఈ మూవీ ట్రెండ్ చేస్తున్నారు. దసరా(Nani Dasara) తర్వాత నాని ఈ సినిమాలో మరోసారి మాస్ అవతార్‌లో కనిపించనున్నట్లు పోస్టర్లు, ట్రైలర్ (Saripoda Sanivaram Trailer)లో చూసిన విషయం తెలిసిందే. వారంలో ఆరు రోజులో ఎంతో ప్రశాంతంగా ఉండే హీరో.. శనివారం వస్తే మాత్రం ఉగ్రరూపుడై పోతాడట. ఇదే అంశంపై ఈ సినిమా రూపొందింది.

ఇక సోషల్ మీడియాలో సరిపోదా శనివారం హంగామా షురూ అయింది. ఈ చిత్రం చూసిన నాని ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు. హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయాయని ఎక్స్ (ట్విటర్ (Saripoda Sanivaram Twitter Review)) వేదికగా షేర్ చేసుకుంటున్నారు. వేగంగా కదిలే స్క్రీన్‌ప్లే, హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్‌తో సూపర్ థ్రిల్ పంచిందని చెబుతున్నారు. సాధారణంగానే నాని యాక్షన్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా.. ఇక నాని, వర్సటైల్ నటుడు ఎస్ జే సూర్య (SJ Surya)తో కలిసి చేస్తే ఈ ఇద్దరు ఒకేసారి స్క్రీన్‌పై కనిపిస్తే ఉంటుంది. ఊహించడానికే అద్భుతంగా అనిపిస్తోంది కదూ. ఈ సినిమాలో స్క్రీన్ పై ఈ ఇద్దరూ కనిపించగానే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాకు ప్రాణం జేక్స్ బెజాయ్ అందించిన మ్యాజిక్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
“సరిపోదా శనివారం మూవీ ఓ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమానే అయినా కేవలం శనివారం మాత్రమే ఫైట్ చేస్తాడనే కాన్సెప్ట్ కొత్తగా ఉందని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. నాని, ఎస్ జే సూర్య పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని మరో నెటిజన్ అన్నాడు. నాని అన్నా హ్యాట్రిక్ కొట్టేశాడహో అంటూ ఇంకో అభిమాని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.






