HIT-3 Glimpse : అర్జున్ సర్కార్ ఆన్ డ్యూటీ.. ‘హిట్-3’లో నాని పవర్ ఫుల్ ఎంట్రీ

ManaEnadu:నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. దసరా, హాయ్ నాన్న (Hi Nanna), ఇటీవల వచ్చిన సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ కొట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ జోష్ మీదున్న ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్​ పైన ఫోకస్ పెట్టాడు. నాని తదుపరి సినిమాల్లో ఒకటి టాలీవుడ్ మోస్ట్ ఎంటర్​టైనింగ్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీలో రాబోతున్న HIT: The 3rd Case తన సొంత బ్యానరల్​ వచ్చిన హిట్, హిట్-2 (HIT-2)లు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. హీరోగా హ్యాట్రిక్ కొట్టిన నాని, తన సొంత బ్యానర్​లో వస్తున్న హిట్ ఫ్రాంఛైజీ సినిమాల్లోనూ హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

హిట్ ఫ్రాంఛైజీలో తాజాగా రాబోతున్న సినిమా హిట్-ది థర్డ్ కేసు. ఈ మూడో భాగంగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ (HIT: The 3rd Case Glimpse)​ను రిలీజ్ చేశారు మేకర్స్. అర్జున్ సర్కారు టేక్స్ ఛార్జ్ అనే క్యాప్షన్​తో మేకర్స్ ఈ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు. అతడు పోలీసుకు తక్కువ.. క్రిమినల్​కు ఎక్కువగా అంటూ నాని క్యారెక్టర్​ గురించి వివరించారు.

“ఈ గ్లింప్స్ వీడియోలో బనిహాల్ పాస్ దగ్గర ఓ బొలెరో వెళ్తోంది.. అందులో మీ ఆఫీసర్ ఉన్నారా? ఉంటే ఆయన ప్రమాదంలో ఉన్నారంటూ ఓ వ్యక్తి సమాచారం అందించగా.. టెంట్​లో ఉన్న మరో ఆఫీసర్.. డేంజర్​లో ఉన్నాడని మీరంటున్న ఆఫీసరే పెద్ద డేంజర్” అంటూ మరో ఆఫీసర్ సమాధానమిస్తాడు. ఆ తర్వాత బొలేరో వాహనంలో నాని డ్రైవ్ చేస్తూ సిగరెట్ తాగుతూ స్టైలిష్ లుక్​లో కనిపించాడు. గెట్.. సెట్.. గో అంటూ నాని చెప్పిన డైలాగ్​తో ఈ గ్లింప్స్ వీడియో ముగుస్తుంది.

గ్లింప్స్ చూస్తుంటే.. క్రైమ్‌ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో నాని అర్జున్‌ సర్కార్ (Arjun Sarkar) అనే పవ‌ర్‌ఫుల్ ఐపీఎస్‌ అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మే 1వ తేదీన విడుదల చేయనున్నారు. శైలేశ్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. హిట్ సినిమా ఫ్రాంచైజీ విష‌యానికి వ‌స్తే.. నాని నిర్మాణంలో ఈ సినిమాలు వచ్చాయి. మొద‌టి పార్ట్‌లో విష్వక్‌ సేన్-రుహానీ శర్మ న‌టించ‌గా.. సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ (Adivis Sesh) – మీనాక్షి చౌదరి న‌టించారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు రాబోతున్న HIT: The 3rd Case హిట్ అయితే నాని నిర్మాతగా హ్యాట్రిక్ కొట్టినట్లవుతుంది. (Nani)

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *