Nivetha Thomas : మొట్టికాయలేస్తెనే మోటివేషన్‌ వస్తుందిరా.. ’35 చిన్న కథ కాదు’ ట్రైలర్‌

ManaEnadu:నివేదా థామస్ (Nivetha Thomas ).. నాని జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ భామ. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. తన నటన, క్యూట్ నెస్ తో మైమరిపించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో సందడి చేసింది. ఈ మధ్య పెద్దగా తెలుగు తెరపై కనిపించడం లేదు. కాస్త లావు అవ్వడంతో ఆఫర్లు రావడం లేదని అంతా అనుకోవడం మొదలు పెట్టారు. కానీ వాళ్ల మాటలను పటాపంచెలు చేస్తూ తాజాగా ఓ క్రేజీ స్టోరీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆ సినిమాాయే ’35- చిన్న కథ కాదు’ (35-Chinna Katha Kaadu).

నివేదా ప్రధాన పాత్రలో విశ్వదేవ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కొత్త డైరెక్టర్ నందకిశోర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి (Priyadarshi) ఓ ప్రత్యేక పాత్రలో అలరించనున్నాడు. సెప్టెంబరు 6వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ (35-Chinna Katha Kaadu Trailer) ను విడుదల చేశారు మేకర్స్. 

“ఓ పని చేయ్.. దర్శనాలకు 1 నొక్కు.. రూములకు రెండు.. ప్రసాదానికి 3.. ఇవన్నీ మళ్లీ వినాలనుకో సున్నా నొక్కు”. అనే డైలాగుతో ఈ ట్రైలర్ మొదలైంది. ‘జీరో అంటేనే ఏమీ లేదు.. దానికన్నా తక్కువా మైనస్ 1, మైనస్ 2 ఎట్లొస్తయి సార్’ అంటూ ఓ బుడ్డోడు చెప్పే డైలాగ్ అదిరిపోయింది. “ఓడిపోవడమనే మైనస్ నుంచి గెలవడమనే ప్లస్ వైపు అడుగులేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా.. ఆ సున్నాని మనం దాటాలి.. గెలిచి తీరాలి” అని మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే భయపడే తన కుమారుడితో నివేదా చెప్పే డైలాగ్ ట్రైలర్ లోనే హైలైట్. మొట్టికాయలేస్తెనే మోటివేషన్‌ వస్తుందిరా..అంటూ స్కూల్‌ విద్యార్థితో ప్రియదర్శి మాస్టర్‌ చెబుతున్న సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

నివేదా థామస్‌ సరస్వతి అనే సాధారణ గృహిణి పాత్రలో నటిస్తుండగా.. తన భర్త, ఇల్లు, పిల్లల చదువు చుట్టూ సినిమా సాగనుందని ట్రైలర్‌ చూస్తే తెలిసిపోతోంది.  విలువే లేని సున్నా పక్కన ఒకటి వేస్తే పది.. 9 కన్నా పెద్దదని ఎట్లా చెప్తరు.. అంటూ నివేదా థామస్‌ అడిగే ప్రశ్నతో సాగే ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రానా దగ్గుబాటి (Rana Daggubati) సమర్పిస్తున్నారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *