రిలీజ్‌కు ముందే జోరుగా ‘దేవర’ బిజినెస్.. భారీ స్థాయిలో టికెట్ ప్రీ సేల్స్

ManaEnadu:గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) టైటిల్ రోల్‌లో నటిస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించారు. దేవర పార్ట్-1 సెప్టెంబరు 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. జనతాగ్యారేజ్ (Janatha Garage) వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ (Koratala Shiva) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడం, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేవర (Devara Release)పై సూపర్ హైప్ క్రియేట్ అయింది.

ఇక దేవర అనౌన్స్‌మెంట్ నుంచి ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై హైప్ పెంచుతూ వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ (Devara Trailer) చూసి ఎన్టీఆర్ ఈసారి మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం పక్కా అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ట్రైలర్‌లో తారక్ తన యాక్షన్, డైలాగ్ డెలివరీతో ఊచకోత కోశాడు. గూస్‌బంప్స్ తెప్పించే బీజీఎం ట్రైలర్‌కు మరింత హైప్‌ను తెచ్చిపెట్టింది. అయితే ట్రైలర్ రిలీజ్‌కు ముందే ఓవర్సీస్‌లో ప్రీ టికెట్ సేల్స్‌లో దేవర క్రేజీ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

ట్రైలర్ విడుదలైన తర్వాత మరిన్ని రికార్డులు (Devara Records) సృష్టిస్తుందన్న ట్రేడ్ వర్గాల అంచనా నిజమైనట్లు కనిపిస్తోంది. దేవర బిజినెస్ చూస్తుంటే ఈసినిమా కలెక్షన్లు సంద్రమంత ఎగిసిపడతాయని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం యూఎస్ మార్కెట్​లో దేవరకు మంచి బజ్​ క్రియేట్ కావడంతో ప్రీ టికెట సేల్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటికే టికెట్ ప్రీ సేల్స్ (Devara Ticket Bookings)​లో మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసిన దేవర మూవీ.. యూఎస్​ఏ ప్రీమియర్స్ సేల్స్​లో ఏకంగా 30 వేలకు పైగా టిక్కెట్లు బుక్ అయినట్లు సమాచారం.

మరోవైపు దేవర థియేట్రికల్ రైట్స్(Devara Theatrical Rights) బిజినెస్ రూ.95 కోట్ల వరకు జరిగినట్లు తెలిసింది. ఆంధ్రా (సీడెడ్ కాకుండా), తెలంగాణ నైజాం ఏరియాలో రూ.53కోట్లు, రూ.42కోట్ల టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీసీలో ప్రీ బుకింగ్స్ చూస్తుంటే రిలీజ్‌కు ముందే దాదాపు రూ.100 కోట్ల సంపాదించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌ (తండ్రీకొడుకు) పాత్రల్లో నటిస్తున్నాడన్న విషయం ట్రైలర్ చూస్తే తెలిసిపోతోంది. చాలా కాలం తర్వాత తారక్ ఊరమాస్ అవతార్‌లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు.

ఇక దేవరలో తారక్ సరసన బాలీవుడ్ భామ, అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌తో పాటు ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, అజయ్, షైన్ టామ్ చాకోలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *