ManaEnadu:అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections 2024) సమీపిస్తున్న వేళ అగ్రరాజ్యంలో రాజకీయం రంజుగా మారింది. డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump)ల మధ్య పోటీ తీవ్రతరం అయింది. ఈ ఇద్దరు పరస్పర విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో జోరు సాగిస్తున్నారు. ఇక వీరికి పలువురు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కమలా హారిస్‌కు అమెరికన్ పాప్ సెన్సేషన్ టైలర్ స్విఫ్ట్(Taylor Swift) మద్దతు ప్రకటించారు. కమలా హారిస్ ఒక వారియర్ అంటూ అభివర్ణించిన టేలర్.. ట్రంప్ రన్నింగ్ మేట్ జేడీ వాన్స్ హారిస్‌పై పిల్లలు లేరంటూ చేసిన కామెంట్స్‌పై కౌంటర్ వేశారు.
‘‘2024 అధ్యక్ష ఎన్నికల్లో నా ఓటు డెమోక్రాటిక్ అభ్యర్థి కమలాహారిస్ (Kamala Harris), టిమ్ వాజ్‌కే. హారిస్ ఓ వారియర్. ఆమె ఒంటరిగా మన హక్కుల కోసం పోరాటం చేస్తోంది. మన హక్కులు మనకు కావాలంటే హారిస్ లాంటి వారియర్ అవసరం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరందరూ ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోండి’. అని టేలర్ స్విఫ్ట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. అయితే టేలర్ తనకు మద్దతు తెలుపుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఫొటోలు షేర్ చేయగా దీనిపై స్పందించిన ఆమె అవి ఏఐ ఫొటోలని క్లారిటీ ఇచ్చారు.
ట్రంప్ రన్నింగ్ మేట్ జేడీ వాన్స్ (JD Vance)..2021లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కమలా హారిస్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో ‘‘పిల్లలు లేని స్త్రీల దైనందిన జీవితం దయనీయంగా ఉంది. వారు దేశాన్ని కూడా అలాగే దయనీయంగా మార్చాలని అనుకుంటారు” అంటూ కమలను ఆయన విమర్శించారు. దీనిపైనా టేలర్ స్విఫ్ట్ స్పందిస్తూ.. తాను కూడా ఛైల్డ్‌లెస్ క్యాట్ లేడీ అంటూ పిల్లిని ఎత్తుకున్న ఫొటోను షేర్ చేశారు. అయితే దీనిపై స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందిస్తూ టేలర్ పిల్లులకు తాను సంరక్షకుడిగా ఉంటానంటూ అభ్యంతకరమైన పోస్టు పెట్టారు.