ManaEnadu:సంయుక్త మీనన్ (Samyuktha Menon).. పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే పాన్ ఇండియా స్టార్ రానాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంది. విరూపాక్ష చిత్రంలో ఈ భామ నటనకు తెలుగు ప్రేక్షకులు వందకు వేయి మార్కులు వేశారు. ఇలా తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది సంయుక్త. తాజాగా ఈ భామ టాలీవుడ్ యంగ్ హీరోతో జత కట్టబోతోంది.
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) లేటెస్ట్గా దర్శకుడు లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. BSS12 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ జులైలోనే ప్రకటించాడు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు అప్డేట్ రాలేదు. కానీ తాజాగా మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాలో బెల్లంకొడ శ్రీను సరసన హీరోయిన్గా సంయుక్త మీనన్ (Samyuktha Menon BSS 12 Movie) నటిస్తోంది. ఇవాళ ఈ భామ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో సంయుక్త పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేశారు. సమీరా అనే పాత్రలో సంయుక్త నటిస్తున్నట్లు చెబుతున్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సమీరా అనే పాత్రతో ప్రేక్షకులను సంయుక్త ఓ మాయా ప్రపంచంలోకి లాక్కెళ్తుందని మేకర్స్ ట్వీట్ చేశారు.
ఈ సినిమాను మహేశ్ చందు నిర్మిస్తున్నారు. ఇందులో నటీనటులకు సంబంధించి ఇఁకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
Team #BSS12 welcomes the ravishing @IamSamyuktha_ on board and wishes her a very happy birthday! ❤️🔥❤️🔥
She's set to draw you into a magical world soon 💥💥@BSaiSreenivas #MaheshChandu @SaiShashank4u @ludheerbyreddy @Leon_James @DSivendra @KarthikaSriniva @Moonshine_Pctrs pic.twitter.com/ldC69GMJts
— Phani Kandukuri (@phanikandukuri1) September 11, 2024