ManaEnadu:బిగ్‌బాస్ (Bigg Boss) హౌజ్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సీజన్లో ‘నో రేషన్’ అంటూ నాగార్జున ముందే చెప్పినా ఫస్ట్ వీక్‌లో మాత్రం అందరికీ ఫ్రీ రేషన్ ఇచ్చాడు బిగ్‌బాస్.
కానీ ఈ వారం నుంచి ‘నో రేషన్’ను పక్కాగా అమలు చేస్తున్నాడు. ఇప్పటికే ఇంట్లో ఉన్న రేషన్ మొత్తం స్టోర్ రూమ్‌లో పెట్టించిన బిగ్‌బాస్ తాజాగా రేషన్ కోసం మూడు టీమ్స్కో ఓ గేమ్ పెట్టాడు. మరి ఆ గేమ్ ఏంటి? అందులో ఎవరు గెలిచారు? అసలు లేటెస్ట్ ప్రోమోలో ఏం జరిగింది? తెలుసుకుందామా?
ఈ ప్రోమో (Bigg Boss Latest Promo)లో ముగ్గురు చీఫ్‌లకి కాస్త టైమ్ ఇచ్చి హౌజ్‌లో ఉన్న సూపర్ మార్కెట్ నుంచి ఈ వారానికి సరిపడా రేషన్‌ను తెచ్చుకోవాలంటూ బిగ్‌బాస్ చెప్పడంతో యష్మీ, నైనిక, నిఖిల్ ఫాస్ట్‌గా వెళ్లి అందినకాడికి సామాన్ల (Bigg Boss Ration)ను తమ బుట్టల్లో వేసేశారు. ఆ తర్వాత ఆ సామానంతా కంటెస్టెంట్లకు దక్కాలంటే తాను పెట్టే టాస్కులో గెలవాల్సిందేనని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు.
అందులో భాగంగా ‘లెమన్ పిజ్జా (Lemon Pizza)’ అనే టాస్కు పెట్టి ఏ టీమ్ అయితే ముందుగా నిమ్మకాయలను బోర్డ్ నుంచి బయటకి తీసి ఎక్కువ రౌండ్స్ గెలుస్తుందో వాళ్లే విన్నర్ అన్నమాట. ప్రోమోలో మూడు టీమ్‌లు పోటాపోటీగా ఆడాయి. కానీ చివరిలో బజర్ మోగిన సమయంలో సంచాలక్ శేఖర్ బాషాపై మణికంఠ సీరియస్ అవ్వడం కనిపించింది. ప్రోమోలో అయితే ఈ గేమ్‌లో గెలిచిన టీమ్ ఎవరిదో తెలియలేదు కానీ. ఈ గేమ్‌లో యష్మీ టీమ్ గెలిచి రేషన్ దక్కించుకుందని సమాచారం. మరి ఎవరు గెలిచారో తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.