Mr.Bacchan: Producer TG Vishwa Prasad discusses the making of ‘Mr Bachchan’ అందుకే ఆగస్టు 15న వస్తున్నాం.. రాజాసాబ్‌ షూటింగ్‌పై అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), డైరెక్టర్ హరీశ్ శంకర్(Harsh Shankar) డైరెక్షన్‌లో రాబోతున్న చిత్రం మిస్టర్ బచ్చన్(Mr.Bacchan). పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌, ధమాకా ప్లస్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోందీ మూవీ. ఈ మూవీలో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ ఆగస్టు 15న థియేటర్లలో గ్రాండ్‌‌గా రిలీజ్ అవనుంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ టి.జి. విశ్వప్రసాద్(TG Vishwa Prasad)పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ షేర్ చేసుకున్నారు.

రవితేజ, హరీశ్ శంకర్ కాంబినేషన్ క్రేజీగా ఉందన్నారు విశ్వప్రసాద్. గత కొంత కాలంగా హరీశ్‌తో ట్రావెల్ చేస్తున్నామని చెప్పిన ఈ నిర్మాత మిస్టర్ బచ్చన్ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పారు. ఎంటర్ టైన్మెంట్, మాస్, యాక్షన్ ఓ రేంజ్‌లో ఉంటాయని చెప్పేశారు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు మే, జూన్‌లోనే షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నామని, కానీ సాంగ్స్ షూటింగ్ కాస్త ఆలస్యం అవడంతో రిలీజ్ డేట్ కాస్త లేటయిందన్నారు.

* తొలుత ఆగస్టు 9నే అనుకున్నాం..

మూవీని తొలుత ఆగస్టు 9వ తేదీనే రిలీజ్ చేయాలనుకున్నారట మూవీ టీమ్. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప-2 స్లాట్ క్లియర్ అవడంతో ఆగస్టు 15కి ప్లాన్ చేసినట్లు చెప్పారు మూవీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్. అనుకున్న బడ్జెట్‌లోనే మూవీ కంప్లీట్ చేశామని, మూవీ పక్కా బంపర్ హిట్ అవుతుందని చెప్పారు. ఇక ఫ్యూచర్‌లోనూ రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో మూవీస్ వస్తాయని క్లారిటీ ఇచ్చాడు ప్రొడ్యూసర్.

* రన్నింగ్‌లో ఐదారు సినిమాలు

ఇదిలా ఉండగా వచ్చే అప్‌కమ్మింగ్ మూవీస్ గురించీ హింట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్. మిరాయ్, జీ2, రాజ్ సాబ్ సినిమాలు లైన్లో ఉన్నాయని చెప్పారు. వీటితోపాటు కన్నడలో గణేశ్ అనే యాక్టర్‌తో 50 కోట్ల స్పాన్ ఉన్న మూవీ చేస్తున్నామని చెప్పారు. ఇంకో మూడు కన్నడ సినిమాలు ఉన్నాయి. తెలుగులోనూ నాలుగైదు సినిమాలున్నాయన్నారు. దీంతోపాటు ఓటీటీలోనూ రిలీజ్ ఓ ఐదు సినిమాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్. ఇక రాజాసాబ్‌ షూటింగ్‌ 50పర్సంట్ పూర్తయిందని న్యూ అప్డేట్ ఇచ్చారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *