Mana Enadu: వరల్డ్‌వైడ్‌గా సినీ అభిమానులు అత్యంత ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తోన్న మూవీ ‘‘పుష్ప-2: ది రూల్(Pushpa2 The Rule)’’. టెక్నికల్ డైరెక్టర్ సుకుమార్(Sukumar), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కాంబోలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అందాల భామ రష్మిక మందన్న(Rashmika Mandanna) ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్(DSP) మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), నిర్మాతలు నవీన్ ఏర్నేని, వై. రవిశంకర్‌లు సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి ఈ మూవీ అంత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6న థియేటర్లలోకి రానుంది.

ఆ ఊహాగానాలకు చెక్
తాజాగా పుష్పరాజ్ రూల్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరో 100 రోజుల్లో(100 Day To Go) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని మైత్రీ మూవీ మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘‘ఇతడి రూల్‍ను మరో 100 వంద రోజుల్లో చూడండి’’ అంటూ అల్లు అర్జున్ ఉన్న పోస్టర్ రివీల్ చేసింది. కాగా ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు పాటలు, టీజర్(Teaser)కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. పుష్ప-2 షూటింగ్ విషయంలో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయంటూ కొంతకాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. అందుకే షూటింగ్ ఆలస్యమవుతోందని సోషల్ మీడియాలో న్యూస్ తెగ ట్రెండ్ అయింది. దీంతో ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుందనే ఊహాగానాలు వినిపించాయి.
అంచనాలను రీచ్ అవుతాం: బన్నీ
అయితే, ఇటీవల మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ఈవెంట్‍కు అల్లు అర్జున్, సుకుమార్ కలిసి హాజరవటంతో ఈ రూమర్లకు చెక్ పడింది. డిసెంబర్ 6న వస్తున్నామంటూ ఆ ఈవెంట్‍లో అల్లు అర్జున్ ఫుల్ జోష్‍తో చెప్పారు. అసలు తగ్గేదెలే అంటూ పుష్ప ఐకానిక్ డైలాగ్ చెప్పారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మూవీ చేసినందుకు ఆలస్యమైందని సుకుమార్ అన్నారు. అంచనాలను ఈ మూవీ చేరుకుంటుందని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడింది. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.






