ManaEnadu:“నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది”. ‘నువ్వు చనిపోయే రోజు తెలిస్తే.. నీకు రోజూ నరకమే’. ‘శివాజీ.. ది గుండు బాస్’. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదూ ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామో. ఇంకేం సినిమా తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ (Rajinikanth) నటించిన శివాజీ-ది బాస్ చిత్రం గురించి.
రజనీకాంత్ సినిమా కెరీర్లోనే శివాజీ (Sivaji: The Boss) సినిమా ఓ సెన్సేషన్. అపరిచుతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రమే శివాజీ. 2007లో విడుదలై తెలుగు, తమిళంలో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద తలైవాకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో డైలాగ్స్, పాటలు అన్నీ సూపర్ హిట్టే.
ఈ చిత్రంలో శివాజీగా, గుండు బాస్‌గా తలైవా (Thalaiva) యాక్టింగ్ అదుర్స్. గుండుతో చేసిన క్యారెక్టర్‌కు అయితే క్రేజీ అభిమానులున్నారు. ఇక ”నాన్న పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది అనే డైలాగ్ చెప్పగానే థియేటర్లలో టాప్ లేచిపోయిందనుకోండి. ఇప్పుడు మరోసాటి టాప్ లేపేందుకు ఈ చిత్రం రెడీ అవుతోంది.
శివాజీ – ది బాస్ (Sivaji Re Release) మూవీ రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని. అయితే ఇప్పటికే రీ రిలీజ్ చేస్తామని నాలుగు సార్లు ప్రకటించి వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా సెప్టెంబరు 20వ తేదీన ఈ చిత్రం రీ రిలీజ్ కాబోతోందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా టికెట్ కూడా కేవలం రూ.99. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
#Sivaji4K pic.twitter.com/Vo4jp8B4rI
— Aakashavaani (@TheAakashavaani) September 10, 2024