ManaEnadu:ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్(Ram Pothineni), డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannath) కాంబోలో తెరకెక్కిన చిత్రం డబుల్ ఇస్మార్ట్(Double ISmart). ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడ్డాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రామ్-పూరీ కాంబో మరోసారి సూపర్ హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ ఫేమ్ సంజయ్ దత్(Sanjay Dutt) విలర్ రోల్ పోషిస్తున్నారు. కామెడియన్ అలీ, శియాజీషిండే కీలక పాత్రల్లో నటించారు. మరి డబుల్ ఇస్మార్ట్ ప్రేక్షకులకు డబుల్ వినోదాన్ని ఇచ్చిందా? మూవీ ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకోవాలంటే సోషల్(Social Media Review) మీడియా రివ్యూపై ఓ లుక్కేయాల్సిందే.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రివ్యూ ఇలా..
* డబుల్ ఇస్మార్ట్ హిట్ నుంచి సూపర్ హిట్ దిశగా వెళుతోంది” అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
* అందరూ రామ్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. కానీ ‘రామ్ అంటేనే ఎనర్జీ. ఎనర్జీ అంటేనే రామ్’ అని మరో నెటిజన్ పోస్ట్ చేశారు.
* పూరి జగన్నాథ్ పర్ఫెక్ట్ కమ్ బ్యాక్… హిట్టు బొమ్మ అని ఓ యూజర్ పోస్ట్ పెట్టాడు.
* మణిశర్మ పాటలు సూపర్.. సంజయ్ దత్ విలనిజం కేక అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
* ‘డబుల్ ఇస్మార్ట్’లో ట్విస్టులు సూపర్.. మూవీని పూరీ ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుంది.
* మెలోడీ బ్రహ్మ మణిశర్మ మాంచి సాంగ్స్ ఇచ్చారని, స్క్రీన్ మీద అవి అదిరిపోయాయ్.
* ‘మార్ ముంత చోడ్ చింతా’ పాటలో రామ్ తన స్టెప్పులతో అదరగొట్టేశారట.
* బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ విలనిజం, రామ్- సంజు బాబా మధ్య సీన్లు కేక అని మరికొందరు నెటిజన్లు పోస్ట్ చేశారు.
ఇలా సోషల్ మీడియాలో రామ్ డబుల్ ఇస్మార్ట్ మూవీపై ఫ్యాన్స్ తమతమ యాంగిల్స్‌లో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పూరీ-రామ్ కాంబో మరో హిట్ కొట్టినట్టినట్లుగానే తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం ఈ వీకెండ్‌ను డబుల్ ఇస్మార్ట్‌తో డబుల్ జోష్‌లో ఎంజాయ్ చేసేయండి..






