Jani Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​పై రేప్ కేసు

ManaEnadu:టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ (Dance Choreographer) జానీ మాస్టర్ గురించి తెలియని వారుండరు. ఢీ (Dhee) అనే డ్యాన్స్ రియాల్టీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత టాలీవుడ్​లో వరుస అవకాశాలు అందుకున్నారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో స్టెప్పులేయించాడు. ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood), కోలీవుడ్​లలో మోస్ట్ బిజీయెస్ట్ కొరియాగ్రాఫర్​గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే తమిళ్​లో తెరకెక్కిన ధనుశ్​ (Dhanush) తిరుచిత్రంబళం సినిమాలో మేఘం కరుకత.. పాటకు గానూ 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ అందుకున్నాడు.

జానీ మాస్టర్​పై లైంగిక వేధింపుల కేసు

కెరీర్ పీక్​ స్టేజ్​లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమా ఇండస్ట్రీల్లో బిజీ అయిన జానీ మాస్టర్ (Jani Master) తాజాగా చిక్కుల్లో చిక్కుకున్నాడు. ఆయనపై తాజాగా ఓ కేసు నమోదైంది. ఏకంగా లైంగిక్ వేధింపుల (Sexual Harassment) కేసు నమోదవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఓ యువతి జానీ మాస్టర్​పై లైంగిక్ వేధింపుల కేసు పెట్టడంతో హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జానీ మాస్టర్ తనను కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అతడి వద్ద పని చేసే ఓ లేడీ యువ కొరియోగ్రాఫర్ (21) ఫిర్యాదు చేసింది.

జానీ మాస్టర్ నన్ను రేప్ చేశారు

ఔట్ డోర్ షూటింగ్స్​ కోసం చెన్నై, ముంబయి, వంటి వివిధ నగరాలకు వెళ్లినప్పుడు తనపై అత్యాచారం (Rape) చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా నార్సింగిలోని తన నివాసంలోనూ జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. ఆమె ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్​ఐఆర్​ కేసు నమోదు చేశారు. అనంతరం నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. జానీ మాస్టర్ (Jani Master Cases)​పై ఐపీసీ సెక్షన్ 376(రేప్), బెదిరింపు (506), గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. గతంలోనే ఓ మహిళపై దాడి కేసులో జానీ మాస్టర్​కు మేడ్చల్ స్థానిక కోర్టు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది.

 

 

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *