ManaEnadu:బాలీవుడ్ బ్యూటీ క్వీన్ శ్రద్ధా కపూర్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ లను బీట్ చేసింది. ఈ భామ నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఇద్దరు హీరోల సినిమా ఫస్ట్ డే కలెక్షన్లను క్రాస్ చేసింది. అంతే కాదు.. ఆల్ టైమ్ హిందీ ఓపెనింగ్స్ టాప్ -10లో స్థానం దక్కించుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో నటించిన మూవీ ‘స్త్రీ-2’. కామెడీ, హార్రర్ జానర్లో అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రద్ధతోపాటు రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్లో నటించాడు. మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఈ సినిమా గురువారం రోజున గ్రాండ్‌గా రీలీజ్ అయింది. అయితే ఫస్ట్ డే కలెక్షన్లలో స్త్రీ-2 మూవీ పలు రికార్డులు బ్రేక్ చేసింది.
శ్రద్ధా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. స్త్రీ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచి సూపర్ హైప్ క్రియేట్ అయింది. ఇక రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా 2024లో బాలీవుడ్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూవీ నిలిచింది. తొలిరోజు రూ.47కోట్లు నెట్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.

స్త్రీ-2 మూవీ ఫస్ట్ డే కలెక్షన్లలోనే కాకుండా ఆల్‌టైమ్ హిందీ ఓపెనింగ్స్ టాప్-10లో స్థానం దక్కించుకుంది. ఈ ఏడాది రిలీజైన కల్కి, ఫైటర్ (హిందీ) తొలి రోజు కలెక్షన్ల కూడా స్త్రీ-2 క్రాస్ చేసింది. ఈ సినిమాలు రూ.22- 24కోట్ల మధ్య వసూల్ చేయగా, స్త్రీ-2 రూ.47కోట్లు సాధించింది. డబుల్ కలెక్షన్లతో ప్రభాస్, హృతిక్ కు టక్కర్ ఇచ్చింది. ప్రీమియర్ షోస్ కూడా కలుపుకుంటే ఈ సినిమా కలెక్షన్లు రూ.55కోట్లు దాటవచ్చని సమాచారం.






