ManaEnadu:మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో శంకర్‌దాదా MBBS ఒకటి. బాలీవుడ్ మూవీ మున్నాభాయ్ MBBSకి రీమేక్‌గా ఈ సినిమాను డైరెక్టర్ జయంత్.సి పరాన్జీ తెరకెక్కించారు. 2004లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీలో చిరంజీవి కామెడీ టైమింగ్‌ని సూపర్. చిరులో ఈ తరహా నటనను యాడియన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. యాక్షన్ ఎలిమెంట్స్ కంటే కామెడీ, సెంటిమెంట్‌కి ఈ చిత్రంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు డైరెక్టర్. ఈ మూవీలో చిరు సరసన సోనాలీ బింద్రే హీరోయిన్‌గా నటించింది. ఇక ఏటీఎం పాత్రలో హీరో శ్రీకాంత్ తన యాక్టింగ్‌తో ఇరగదీశారు. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ నెల 22న మూవీని రీరిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
4K వెర్షన్‌లో
ఈ సూపర్ హిట్ మూవీని 4K వెర్షన్‌లో రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. అందుకు తగ్గట్లుగానే తాజాగా శంకర్ దాదా MBBS 4K వెర్షన్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇటీవల మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ అయిన ‘మురారి’ సినిమా కలెక్షన్లు (దాదాపు 9 కోట్ల గ్రాస్) శంకర్ దాదా బద్దలు కొడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ డైలాగ్స్, సాంగ్స్ సూపర్
‘‘రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం’’, ‘‘ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్’’, ‘‘వల్చర్ ఈటింగ్ హండ్రెడ్ బఫ్ఫల్లోస్, వన్ సైక్లోన్ ఫినిష్’’ అంటూ చిరు చెప్పిన డైలాగులు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. బేగంపేట బుల్లెమ్మా, పంజాగుట్టా పిల్లమ్మా.. పట్టు పట్టు చేయే పట్టు, నా పేరే కాంచనమాల, ఛైల ఛైలా ఛైలా ఛైలా, నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా, ఏ జిల్లా ఏ జిల్లా అనే పాటలు థియేటర్లోనే ప్రేక్షకులు స్టెప్పులేసేలా ఉన్నాయి. ఇక పరేష్ రావల్, గిరీష్ కర్నాడ్, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్, ఆలీ, ఆహుతి ప్రసాద్, రోహిత్ వంటి నటులు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో ప్రధాన అస్సెట్.