ManaEnadu:బాలీవుడ్ ప్రిన్సెస్.. యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి తెలియని వారుండరు. ఈ భామ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీబిజీగా సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన స్త్రీ2 మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా 2018లో వచ్చిన స్త్రీ చిత్రానికి స్త్రీ2 సీక్వెల్. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
అయితే విడుదలకు ముందే శ్రద్ధా కపూర్ స్త్రీ2 సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఈ కామెడీ హార్రర్ మూవీ బాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్ లో స్టార్ హీరోల చిత్రాలను కూడా దాటేసిందట. ఏకంగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ’ల అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లను దాటేసిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా టికెట్ల బుకింగ్స్ ద్వారా రూ.20 కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.
బాలీవుడ్‌లో ఆగస్టు 15న స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేమ్ మే, జాన్ అబ్రహాం నటించిన వేదా కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ చిత్రాలన్నిటి అడ్వాన్స్ బుకింగ్స్ కంటే శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’కే ఎక్కువ రావడం గమనార్హం. ఇది ఇలాగే కొనసాగితే స్త్రీ2 ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదిరిపోతాయని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి శ్రద్ధా కపూర్ కు తూ ఝూఠీ మై మక్కార్ ఫెయిల్యూర్ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ హిట్ పడబోతుందన్న మాట.
‘స్త్రీ 2 విషయానికొస్తే.. ఓవైపు భయపెడుతూనే మరోవైపు నవ్వుల్లో ముంచెత్తేవిధంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇందులోని పాటలు కూడా విపరీతంగా ఫ్యాన్స్ కు నచ్చేశాయి. అభిమానుల కోసం ఆగస్టు 14న ప్రత్యేక ప్రివ్యూ షోలను ప్రదర్శిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.






