బాలయ్య ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్.. #NBK109 టీజర్ రిలీజ్ అప్పుడే

Mana Enadu:బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. .. #NBK109 వర్కింగ్ టైటిల్. అయితే ఈ సినిమా గురించి బాబీ ఓ క్రేజీ అప్డేట్ ను బాలయ్య అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అంతే కాదండోయ్.. ఈ చిత్రానికి సంబంధించి మోస్ట్ ఇంటెన్స్ షెడ్యూల్ షూటింగ్ ను రాజస్థాన్ లోని జైపుర్ లో చిత్రీకరించినట్లు తెలిపాడు. బాలకృష్ణ ఎనర్జీ సెట్ లో అందరికి ఉత్సాహాన్నిచ్చిందని చెప్పాడు. జైపుర్ లో షూట్ చేసిన సీన్లలో బాలయ్యలో నెవర్ సీన్ అవతార్ ను చూస్తారని సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు బాబీ.
ఇక గత కొంతకాలంగా ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో ఎప్పుడూ చూడనంత ఊర మాస్ అవతార్ లో చూస్తామని నెట్టింట ప్రచారం సాగుతోంది. అందుకే ఈ సినిమాకు వీరమాస్ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ టైటిల్ నందమూరి ఫ్యాన్స్ కు ఏ మాత్రం నచ్చలేదట. మరో మంచి ఎనర్జిటిక్ టైటిల్ ను ఈ సినిమాకు పెట్టాలని బాబీకి రిక్వెస్టులు వస్తున్నాయట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణను ఎదుర్కొనేందుకు బాలీవుడ్ స్టార్ హీరో రంగంలో దిగనున్న విషయం తెలిసిందే. యానిమల్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న బాబీ దియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక మరో ప్రధాన పాత్రలో కన్నడ నటుడు రిషి నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.

Share post:

లేటెస్ట్