Kanguva Trailer: కంగువా ట్రైలర్ వచ్చేసింది.. సూర్య లుక్స్ మైయిండ్ బ్లోయింగ్ అంతే

Mana Eenadu: సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త సినిమాల జోరు కనిపిస్తోంది. దాదాపు అరడజనుకుపైగా చిత్రాలు ఈ వారంలోనే రిలీజ్ కానున్నాయి. కొన్ని సినిమాల మేకర్స్ టీజర్లు, ట్రైలర్లు విడుదల చేస్తూ ఫ్యాన్ బజ్‌ను క్రియేట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya)నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘కంగువా'(Kanguva) చేరింది. ప్రముఖ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. యానిమల్ నటుడు బాబీ డియోల్(Bobby Deol)మరోసారి విలన్‌ రోల్‌లో కనిపిస్తున్నాడు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌(UV Creations)బ్యానర్లపై ప్రొడ్యూసర్లు జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌లు దాదాపు 300 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 దసరా కానుకగా..

తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ట్రైలర్‌(Trailer)ను విడుదల చేశారు. ఇప్పటికి హాఫ్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. దసరా కానుకగా అక్టోబర్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ విషయంలో మేకర్స్ ప్లాన్ హైలైట్ అని చెప్పాలి. దాదాపు రెండు నెలల ముందే ట్రైలర్‌ను విడుదల చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఈ సినిమాపై ఫస్ట్ నుంచి వస్తున్న హైప్ ట్రైలర్‌లోనూ కనిపించింది. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టెంగ్ న్యూస్ పై సినీ టౌన్లో చక్కర్లు కొడుతోంది. తొలుత ఈ మూవీ 10 భాషల్లోనే రిలీజ్ చేయాలని భావించారట. కానీ ఇప్పుడు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 36 భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

రెండు తెగల మధ్య సాగే పోరాటాన్ని అద్భుత మైన యాక్షన్ సీక్వెన్స్ జోడించి శివ ఈ సినిమాను తెరకెక్కించాడు. మొయిన్‌గా సముద్రంలో సాగే యాక్షన్ సీన్స్ మూవీకే హైలైట్‌గా నిలువనున్నాయి. ఇక స్టార్ హీరో సూర్య తన మేనరిజాన్ని కంటిన్యూ చేశాడు. ఫైట్స్ సీన్స్‌లో అయితే సూర్య యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తన అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేశాడు. ట్రైలర్ చివరిలో వచ్చే మొసలి సీన్ అయితే హైలెట్ అని చెప్పుకోవచ్చు.

 కీ రోల్‌లో మరో స్టార్ హీరో..

ఈ మూవీలో సూర్య థ్రిబుల్ యాక్షన్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్లో ఇప్పటికే రెండు లుక్స్ రివీల్ చేశారు మేకర్స్. ఇంకో విషయం ఏంటంటే.. కంగువాలో సూర్య సోదరుడు కార్తీ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లాస్ట్‌లో ఒక వ్యక్తి ఫేస్‌ను చూపించకుండా సస్పెన్స్ క్రియేట్ చేసింది మూవీ టీమ్. కాగా ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad)స్వరాలు సమకూరుస్తున్నాడు. ట్రైలర్‌లో BGM దద్దరిల్లిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ కంగువా ట్రైలర్ చూసేయండి..

Share post:

లేటెస్ట్