Raayan OTT Release: ఓటీటీలోకి ధనుష్ ‘రాయన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Mana Enadu:కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటించిన తాజా చిత్రం రాయన్(Raayan). ఈ మూవీ స్పెషల్ ఏంటంటే ధనుషే దీనిని డైరెక్ట్ చేశారు. ఆయన కెరీర్‌లో రాయన్ 50వ సినిమా. ఇందులో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్(Sandeep kishan)కీ రోల్ పోషించాడు. ప్రకాశ్ రాజ్, SJ సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. ఏఆర్ రెహమాన్(Ar Rehman) మ్యూజిక్ అందించారు. జులై 26న థియేరట్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ లో ఈ సినిమాకు ఇప్పటికే వంద కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. అటు తెలుగులోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ఈ మూవీ హస్ ఫుల్ వసూళ్లతో దూసుకుపోతోంది.

అన్నదమ్ముల సంబంధం నేపథ్యంలో సాగే ఈ మూవీపై తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్(Amazon prime) వీడియోతో పాటు సన్ నెక్ట్స్(Sun nxt) ధనుష్ రాయన మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నాయని వార్తలు వస్తున్నాయి. అన్ని సెట్ అయితే ఆగస్టు 30 నుంచి ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దానిపై ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని సమచారం. దీని గురించి మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

త్వరలోనే ‘కుభేర’

కాగా రాయన్ సినిమాలో ధనుష్ చెల్లెలిగా దుర్గగా దుషారా విజయన్ అద్భుతంగా నటించింది. అలాగే కాళిదాస్ జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్, దిలీపన్, ఇళవరసు.. తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఇక రాయన్ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తున్నాడు ధనుష్. ఇందులో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మరో కీలక పాత్రలో కనిపించనుండగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika mandanna) కథానాయికగా నటిస్తోంది. ఇది వరకే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

Share post:

లేటెస్ట్