హాలీవుడ్ మూవీతో ఇండస్ట్రీకి స్టార్ హీరో కుమారుడి ఎంట్రీ.. వీడియో చూశారా?

ManaEnadu:హాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’. ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది.  ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ నటిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి హిందీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

అయితే ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి ఓ స్టార్ హీరో తనయుడు ఎంట్రీ ఇస్తున్నాడు. అతనెవరో కాదు బాలీవుడ్ బాద్ షో షారుక్ ఖాన్ చిన్న కుమారుడు అబ్ రామ్. అయితే ఈ సినిమాలో అబ్ రామ్ నటించడం లేదు. మరి ఎంట్రీ ఎలాగంటారా.. ముఫాసా ది లయన్ కింగ్ హిందీ వెర్షన్ లో చిట్టి ముఫాసా పాత్రకు అబ్ రామ్ వాయిస్‌ అందించారు. ఇదే సినిమాలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్‌ ఖాన్‌, సింబా పాత్రకు షారుక్‌ పెద్ద తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ వాయిస్‌ ఇచ్చాడు. ఈ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ.. తన పిల్లలతో కలిసి ఒక సినిమా కోసం వర్క్‌ చేయడంపై ఆనందంగా ఉందని అన్నారు. 

“ముఫాసా అడవికి రారాజు.. తన తనయుడు సింబాకు తన జ్ఞానాన్ని అందించాడు.  ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. చిన్నప్పటి నుంచి అడవికి రాజుగా ఎదిగే వరకు ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయం తెలియజేస్తుంది. 2019లో వచ్చిన ‘ది లయన్‌ కింగ్‌’ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది.  నా పిల్లలతో కలిసి వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది’’ అని షారుక్‌ ఖాన్ చెప్పుకొచ్చాడు. 

 

 

Share post:

లేటెస్ట్