ManaEnadu:తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రియాల్టీ షోస్ లో మొదటి స్థానం బిగ్ బాస్ సొంతం. ఇప్పటికే ఈ షో 7 సీజన్లు విపరీతంగా ఫన్ పంచాయి. ఒక్కో సీజన్ లో ఒక్కో రకమైన ఫన్ ఎలిమెంట్ యాడ్ చేసి మస్త్ మజా అందించిన ఈ కార్యక్రమం ఇప్పుడు సరికొత్తగా ఎనిమిదవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే 8వ సీజన్ కు సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో 8వ సీజన్ కు సంబంధించి మరో కొత్త ప్రోమో రిలీజ్ అయింది.
బిగ్ బాస్-8 తెలుగు కొత్త ప్రోమో ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈసారి ఏకంగా ప్రోమోతో పాటు సాంగ్ కూడా రిలీజ్ చేశారు. దేఖో.. దేఖో బిగ్ బాస్ అంటూ సాగిన ఈ సాంగ్ క్యాచీగా ఉంటుంది. దేఖో దేఖో మస్తు ఆటే బిగ్ బాస్.. ఇప్పుడంతకన్న వేటే బిగ్ బాస్.. ఈడ లేనిదొక్క లిమిటే బిగ్ బాస్.. కన్నులకు పండుగనేరో అంటూ సాగిన ఈ పాటలో హోస్టు నాగార్జున స్టెప్పులు అదిరిపోయాయి. అమ్మాయిలతో కలిసి నాగ్ డ్యాన్స్ చేయడం ఈ వీడియోలో హైలైట్ గా నిలిచింది.
ఇక వీడియోలో నాగార్జున ఇంకా ఏం కావాలి అని అడగ్గా.. ఏకాంతం కావాలి అని నటుడు సత్య అంటాడు. దానికి నాగ్ జాగ్రత్తగా ఆలోచించుకో ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదంటారు. అయినా సత్య నాకు ప్రైవసీ కావాలని అనడంతో ఏకంగా సత్యను ఎవరూ లేని ఎడారిలో ఏకాంతంగా వదిలేస్తాడు. ఇక ఈ వీడియో చివరలో ఈసారి బిగ్ బాస్ -8లో ఫన్ కు, ఎంటర్టైన్మెంట్ కు , ట్విస్టులకు లిమిటే లేదంటూ నాగ్ డైలాగ్ చెబుతారు. ఇప్పుడు బిగ్ బాస్ -8 ప్రోమో సాంగ్ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ సీజన్ ఆగస్టు నెల చివరలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో మొదలు కానుంది.