Yentha Pani Chesav Chanti: ఈ సినిమా ఆడవాళ్లకు మాత్రమే..

ManaEnadu:ఈ చిత్రం ఆడవాళ్లకు మాత్రమేన‌ని.. మగవారు పొరపాటున కూడా చూడొద్దని ఎంత పని చేశావ్ చంటి చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ అన్నారు. ఆయ‌న డైరెక్ట్‌ చేసిన నూత‌న చిత్రం ఎంత పని చేశావ్ చంటి ట్రైల‌ర్ తాజాగా విడుద‌ల చేశారు

శ్రీనివాస్ ఉలిశెట్టి (Srinivas Ulishetty), దియారాజ్ (Diya Raja), నీహారిక (Neaharika), శాంతిప్రియ (Shanthi Priya) హీరో, హీరోయిన్లుగా గ‌తంలో తస్మాత్ జాగ్రత్త ( Tasmath Jagratha) చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఉదయ్ కుమార్ (Uday Kumar) దర్శకత్వంలో పి.జె.కె.మూవీ క్రియేషన్స్ (PJ K Movie Creations) పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా లడ్డే బ్రదర్స్ (Ladde Brothers) నిర్మించిన విభిన్న కథా చిత్రం ఎంత పని చేశావ్ చంటి (Yentha Pani Chesav Chanti). ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్, నిర్మాతల మండలి హాల్‌లో ట్రైలర్ రిలీజ్ వేడుక వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు నేను లోక‌ల్‌, ధ‌మాకా ఫేం దర్శకుడు త్రినాథరావు (Trinadharao Nakkina) నక్కిన ముఖ్య అతిధిగా విచ్చేసి, ట్రైలర్ రిలీజ్ చేసి, వైజాగ్‌కు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులతో రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి, మరింతమందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *