Pranitha Subhash : మగబిడ్డకు జన్మనిచ్చిన పవర్ స్టార్ హీరోయిన్.. నెట్టింట శుభాకాంక్షలు

ManaEnadu:’బొంగరాళ్లాంటి కళ్లు తిప్పింది.. ఉంగరాలున్న జుట్టు తిప్పంది.. గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పింది.. అమ్మో.. బాపుగారి బొమ్మో’ ఈ పాట వింటుంటే మీ మైండ్​లో టాలీవుడ్ నటి ప్రణీత (Pranitha Subhash) మెదులుతోంది కదా. తన బొంగరం లాంటి కళ్లతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది ప్రణీత. అత్తారింటికి దారే (Atharintiki Daaredi)ది సినిమాతో తెలుగు కుర్రాళ్ల మదిని దోచేసింది. ఈ భామ చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది.

ప్రణీతకు పండంటి మగబిడ్డ..
ప్రణీత ఇప్పటికే ఓ బిడ్డకు తల్లయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ భామ రెండోసారి తల్లయింది. బుధవారం రోజున పండంటి మగబిడ్డ (Baby Boy)కు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన బాబు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ప్రణీతకు కంగ్రాట్స్ చెబుతున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

‘‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’తో ఎంట్రీ
టాలీవుడ్​లో ప్రణీత ‘‘ఏం పిల్లో.. ఏం పిల్లడో(em pillo em pillado)’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కన్నడ భామ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో మంచి పాపులారిటీ వచ్చింది.

కరోనా సమయంలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుని ప్రణీత వివాహ మాడింది. 2021లో కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ప్రణీత-నితిన్ (Pranitha Weds Nitin Raj) వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 2022లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రెండో కాన్పులో ఈ బ్యూటీ పండంటి మగబిడ్డను కన్నది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *