ManaEnadu: రఘు గద్వాల్, ప్రియాంకశ్రీ, శివ ప్రసన్న ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘వెంకటలక్ష్మీతో..’ ‘యాడాది కిందట’ (Venkata Lakshmi Tho Yadadi Kindhata)అనేది ఉపశీర్షిక. రామ్మూర్తి కొట్టాల దర్శకుడు. ఆలేటి రాజేశ్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ని హీరో శ్రీకాంత్ చేతులమీదుగా లాంచ్ చేశారు. సినిమా ఘన విజయం సాధించాలని శ్రీకాంత్ అభిలషించారు. థ్రిల్లర్, సస్పెన్స్ అంశాలతో కూడుకున్న స్వచ్ఛమైన ప్రేమకథ ఇదని, అందరూ కొత్తవాళ్లతో ఈ సినిమా చేశామని, ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీల్ కలుగుతుందని దర్శకుడు చెప్పారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రిషి, టి.మహిధర్, సంగీతం: సీఎన్ ఆదిత్య, నిర్మాణం: టింట్ స్ప్రీ స్టూడియోస్.
స్వచ్ఛమైన ప్రేమ కథ..అందరూ కొత్తవాళ్లే..ఇప్పుడు ట్రెండ్ ఇదే
లేటెస్ట్