Mana Enadu:ఇండియాలో ఒక్కో టెంపుల్‌కి ఒక్కో చరిత్ర ఉంటుంది. ఆయా ఆలయాల్లో అక్కడి సంప్రదాయాలను బట్టి అక్కడి దేవుళ్లను ప్రజలు పూజిస్తుంటారు. ఒక్కో దేవుడుకి ఒక్కో విధంగా నైవేద్యాలు ప్రసాదిస్తుంటారు. ఇక చాలా గుడుల్లో కొన్ని విచిత్ర సంప్రదాయాలు ఉంటాయి. అక్కడి వాళ్లు కచ్చితంగా అవి పాటిస్తూ ఉంటారు. ఇక ఇలాంటివి ఈజీగానే పాపులర్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు కూడా మనం మాట్లాడుకోబోయేది ఇలాంటి పాపులర్ గుడి గురించే. ఈ ఆలయం దగ్గర ఏ చిన్న రాయిని కదిలించినా సరే కచ్చితంగా ఓ తేలు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటేంటే ఆ తేళ్లను పట్టుకున్నా లేదా శరీరంపై పెట్టుకున్నా సరే కాటేయకుండా హాని కలిగించకుండా ఉంటాయట. ఏటా శ్రావణమాసంలో వచ్చే తొలి పంచమిని తేళ్ల పండుగ(Scorpion Festival)గా జరుపుకుంటారట అక్కడి ప్రజలు.
అదే ట్విస్ట్..
అయితే ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఈ తేళ్లు కూడా ఒక్క నాగుల పంచమీ రోజు మాత్రమే ఇలా కనిపిస్తూ ఎలాంటి హాని చేయకుండా ఉంటాయట. నాగుల పంచమి రోజు కాకుండా మిగతా రోజుల్లో ఆ గుట్టపైనున్న ఏ తేలును ముట్టుకున్నా సరే అవి కుట్టేస్తాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. తెలంగాణ(Telangana)లోని నారాయణపేట పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో.. కర్ణాటక(Karnataka)లోని యాద్గిర్ జిల్లా కందుకూరు గ్రామంలో కొండ మహేశ్వరమ్మ అమ్మవారి ఆలయం ఉంది. ఈ గుడి దగ్గర ఏటా శ్రావణ మాసం మొదటి శుక్రవారం కచ్చితంగా జాతర చేసి అమ్మవారిని కొలుస్తారట. ఇక్కడే తేళ్లతో సయ్యాటలు ఆడటం ఆనవాయితీగా వస్తోదంటే. ఈ గుడిలో తేళ్లను ఇలవేల్పుగా కొలవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం అని తెలుస్తోంది. వినడానికి కొంత వింతగా ఉన్నా గానీ ఇదే నిజం అని చెప్తున్నారు. నిజంగానే చాలా వింతగా అనిపిస్తోంది కదూ..