Mana Enadu:ప్రస్తుత హరిబరీ కాలంలో గుండెపోటు(Heart Attack)తో చనిపోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఒకప్పుడు 45-50 మధ్య వారిలోనే హార్ట్ ఎటాక్ సమస్యలు ఉండేవి. కానీ ప్రస్తుత జనరేషన్లో చిన్నాపెద్దా అని వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. ఎప్పుడు, ఏ క్షణంలో ఎక్కడ కుప్పకూలిపోతున్నామో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి
అయితే గుండె పోటు లక్షణాలు చాలా రకాలుగా ఉంటాయని వైద్య నిపుణులు(Doctors) అంటున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే ఇక అంతే సంగతి అని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా హార్ట్ ఎటాక్‌లకు మనం రోజూ తీసుకునే ఆహారమే(Food) కారణమని వైద్యులు చెబుతున్నారు. అయితే మహిళలు, పురుషుల్లో ఈ లక్షణాలు వేర్వేరుగా ఉంటాయట. ముఖ్యంగా ఈ సమస్యను మహిళల్లో గుర్తించడం కొంత కష్టమేనని చెబుతున్నారు వైద్యులు.
ఆహారంలో వీటిని తగ్గించాలి..
చాలా మందికి విపరీతమైన చెమటలు రావడం, లేదా ఆకస్మాత్తుగా చల్లగా చెమటలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది హార్ట్ ఎటాక్‌కి సంకేతమని అంటున్నారు. సాధారణంగా ఎడమవైపు లేదా ఛాతి మధ్యలో ఒత్తిడి ఉంటడం, ఆయాసంగా అనిపించడం మహిళల్లో గుండెపోటుకు లక్షణాలుగా పేర్కొన్నారు. అందుకే రోజూ తీసుకునే ఆహారంలో అధికంగా నూనె, ఫ్రైఫుడ్ తీసుకోవడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. డైలీ 45 నిమిషాలు వ్యాయామం(Exercise) లేదా యోగా(Yoga) వంటివి చేయాలని సూచిస్తున్నారు.