మరణానికీ ప్లానింగ్.. ఎందుకో తెలుసా?

మరణం..
మరణం..
మహా సేనా..!
ఏది మరణం..?
Mana Enadu:మన గుండె ధైర్యం కన్నా శత్రుబలగం పెద్దది అనుకోవటం మరణం.., రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బతికుండటం మరణం.. నాతో వచ్చేదెవరు..? నాతో చచ్చేదెవరు..? ‘బాహుబలి(Bahubali)’ క్లైమాక్స్ సీన్‌లో సైనికుల్లో స్థైర్యాన్ని నింపుతాడు ప్రభాస్(Prabhas). అలాగే నిజ జీవితంలోనూ మనం ఇలాగే ఉండాలి. కష్టాలకు తలొగ్గి, బాధలకు కుంగిపోయి ప్రాణాలు తీసుకోవడం నిజంగా పిరికిచర్యే.

పుట్టినవాడు గిట్టక మానడు.. గిట్టినవాడెల్లా మళ్లీ పుట్టకమానడు. అనివార్యం అయిన వాటికి శోకించడం తగదు అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఎప్పడో చెప్పాడు. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? అందుకు రీజన్ తెలుసుకుందాం.. పదండీ..

 వీటిపై ఇంట్లో వారితో డిస్కస్ చేయండి..

మన ఫ్యామిలీలో సాధారణంగా విద్య(Study), ఉద్యోగం(Job), ఆస్తి, అంతస్తులు, ఆరోగ్యం(Health), పిల్లలు ఇలా అన్నింటిపైనా చర్చ జరుగుతుంది. కానీ అనివార్యం అయిన మరణంపై ఆలోచించాలంటేనే భయపడతాం. కానీ అలాంటి చర్చ జరిగినప్పుడే వాస్తవాలు తెలుస్తాయంటున్నారు మానసిక వైద్యనిపుణులు. నిజానికి చావుపై చర్చ జరిగినప్పుడే మనలో భయం తగ్గుతుందట, లక్ష్య సాధనవైపు వడివడిగా అడుగులు వేసేందుకు కృషి చేస్తామట. ముఖ్యంగా ‘‘వీలునామా రాయండం, ముఖ్యమైన పత్రాలను మెయిన్‌టైన్ చేయడం, ఆర్థిక వ్యవహారాలు(Financial Issues) నిర్వహించడం, అవయవ దానం గురించి చర్చించడం, మీ కోరికలను కుటుంబ సభ్యలతో డిస్కస్ చేయండం’’ వంటివి చేస్తామట. పైగా కుటుంబ సంక్షేమం కోసం ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకుంటామని చెబుతున్నారు మానసిక, ఆర్థిక నిపుణులు. అందుకే మరణానికి ఓ ప్లానింగ్(Planning) అవసరమంటున్నారు నిపుణులు.. దీనిపై మీరేమంటారు.?

 

Related Posts

పీరియడ్స్ సమయంలో తలస్నానం హానికరమా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

పీరియడ్స్ సమయంలో తలస్నానం(Washing Your Hair During Periods) చేయకూడదని పెద్దలు చెప్పడం మనందరికీ తెలుసు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదని గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి చెబుతున్నారు. పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో కడుపునొప్పి, శరీర నొప్పులు,…

Sonia Gandhi: మళ్లీ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. ఏమైందంటే!

కాంగ్రెస్(Congress) పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె నిన్న రాత్రి ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి(Sir Ganga Ram Hospital)లో చేరారు. సోనియా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *