OnePlus 13 leaks: త్వరలో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్.. అబ్బో ఫీచర్స్ కేక!

Mana Enadu: మొబైల్ లవర్స్‌కు మరో గుడ్‌న్యూస్. టాప్ బ్రాండ్ మొబైల్ సంస్థ One plus తాజాగా మరో కొత్త మోడల్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 13ని మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. ఈ ఫోన్‌కు సంబంధించి ఫీచర్లు(Features), స్పెసిఫికేషన్లు(Specifications) ఒక్కొక్కటిగా లీవ్ అవుతూ వస్తున్నాయి. ఈ ఫోన్ అక్టోబర్/నవంబర్‌లో లాంచ్ చేసేందకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ ఫోన్ ధరలు, ఫీచర్లు తెలుసుకుందాం. పదండి..

 క్వాలిటీకే అధిక ప్రాధాన్యత

OnePlus మొబైల్ కంపెనీ మొదటి నుంచీ క్వాలిటీ(Quality)కి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే ఈ కంపెనీ ఫోన్లకు సపరేట్ ఫ్యాన్ బేస్(Fan base) కూడా ఉంది. అందుకే చాలా మంది ఈ కంపెనీ ఫోన్లను ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. తాజాగా OnePlus 13 కూడా ఈ లైన్‌లో చేరనుంది. ఈ కొత్త మొబైల్ దేశంలో పెద్ద 6000mAh కెపాసిటీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. కొత్త OnePlus ధర గతంలో లాంచ్ అయిన OnePlus 12 ఫోన్ ధరతో సమానంగా ఉంటుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

 ఆండ్రాయిడ్ వర్షెన్ 14తో వస్తోంది..

OnePlus 13 Features And Specifications లాంచ్ డేట్ ప్రకటించకముందే వన్‌ప్లస్ 13 మొబైల్ ఫీచర్లు లీక్ అయ్యాయి. నివేదిక ప్రకారం ఇది 6.7 అంగుళాల మైక్రో కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ 1440 x 3168 Pixel 2K రిజల్యూషన్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ 120Hz రిఫ్రెష్ రేట్, LTPO టెక్నాలజీతో కూడిన అల్ట్రాసోనిక్ ఇన్ స్క్రీన్ Finger print సెన్సార్‌ను కలిగి ఉంటుంది. రాబోయే OnePlus 13 స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది O916T హాప్టిక్ మోటార్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ OS 14పై రన్ అవుతుంది. ఇందులో అల్ట్రాసోనిక్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఫోన్‌ 12GB+256GB, 16GB+512GB వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. వీటి ధరలు వరుసగా రూ.64,999.రూ. 69,999. ఈ ఫోన్ కావాలనుకునే వారు మరో రెండు నెలలు ఆగాల్సిందే.

Share post:

లేటెస్ట్