PNB Debit Cards: స్పెషల్ డెబిడ్ కార్డులు వచ్చేశాయ్… కేవలం వారి కోసమే!

ManaEnadu:ప్రస్తుతం దేశంలో బ్యాంకింగ్(Banking) సేవలు బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు బ్యాంకు ఖాతా తెరవాలంటేనే నానా తంటాలు పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. క్షణాల్లో బ్యాంకు ఖాతా ఓపెన్ అవుతోంది. ఏకంగా కొందరు ఏజెంట్లు ఇంటికి వచ్చి మరీ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తున్నారు. పైగా ప్రభుత్వ పథకాల(Govt Schemes) విస్తృతి పెరగడం, ప్రభుత్వాలూ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుండడం వల్ల బ్యాంకు ఖాతా కచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం కూడా భారీగా పెరిగింది. డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నేరుగా ఏటీఎమ్స్‌లో డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. అయితే దృష్టిలోపం ఉన్న వారు కార్డులను ఉపయోగించడం కష్టంతో కూడుకున్న విషయం అని తెలిసిందే. దీంతో వీరు ఇప్పటికే డెబిట్ కార్డులకు బదులుగా డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇలాంటి వారికోసమే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(PNB)గుడ్ న్యూస్‌ చెప్పింది.

ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ తాజాగా దివ్యాంగుల కోసం ప్రత్యేక డెబిట్ కార్డులను తీసుకొచ్చింది. బ్రెయిలీ డెబిట్ కార్డులను లాంచ్‌ చేశారు. ఈ కాంటాక్ట్‌లెస్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) డెబిట్ కార్డ్ రూపే నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుంది. దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేందుకు పీఎన్‌బీ ఇలాంటి చర్యలను తీసుకుంది.
ఈ కార్డు సహాయంతో గరిష్ఠంగా రూ. 25,000గా నిర్ణయించారు. అయితే PoS, eCom పరిమితులు కలిపి రోజుకు రూ. 60,000. NFC-అనుకూలమైన POS టెర్మినల్స్‌లో పిన్ లేకుండా రూ. 5000 వరకు లావాదేవీలు చేసుకోవచ్చు.

 స్పెషాలిటీ ఏంటంటే..

ఈ కార్డు స్పెషాలిటీ విషయానికొస్తే.. వీటిపై బ్రెయిలీ లిపిని ప్రింట్ చేస్తారు. దీంతో దృష్టి లోపం ఉన్న కస్టమర్లు PNB, ఇతర బ్యాంక్‌ కార్డుల మధ్య తేడాను గుర్తించడం ఈజీ అవుతుంది. అలాగే డెబిట్ కార్డ్‌తో పాటు వచ్చే వెల్‌కమ్ లెటర్ కూడా బ్రెయిలీ డాట్స్‌లో ఉంటుంది. దీంట్లో వారికి అందించే సేవలను పొందుపరుస్తారు. ఈ డెబిట్ కార్డ్ చిప్‌కు ఎదురుగా రౌండ్ నాచ్ ఉంటుంది. ATM/POSలో కార్డును ఇన్‌సర్ట్ చేసేటప్పుడు, దాని డైరెక్షన్ తెలిసేలా ఈ ఏర్పాట్లు చేశారు.

 

Share post:

లేటెస్ట్