అంట్లు తోమినా ఇంతకంటే ఎక్కువ పైసలొస్తయి.. ‘కాగ్నిజెంట్‌’ ప్యాకేజ్​పై నెట్టింట ట్రోల్స్

ManaEnadu:ప్రస్తుతం నేటి తరం యువత ఐటీ ఉద్యోగాలపైనే ఎక్కువ మక్కువ చూపుతోంది. దానికి కారణం భారీ ప్యాకేజీలు. వర్క్ లోడ్ ఎంతున్నా.. ఎంత ఒత్తిడి పెట్టినా.. కార్పొరేట్ కల్చర్​కు అలవాటు పడలేకపోయినా.. అన్ని కష్టాలు తట్టుకునైనా సరే ఐటీ ఉద్యోగాన్నే చేయాలనుకుంటున్నారు. భారీ ప్యాకేజీలు నేటి తరం యువతను ఆ వైపునకు ప్రోత్సహిస్తున్నాయి. ఎమ్మెన్సీ కంపెనీలు పెద్ద మొత్తాల్లో శాలరీ ఆఫర్ చేస్తూ యువతను అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో ఒకటి కాగ్నిజెంట్. అయితే ఈ ప్రముఖ ఐటీ కంపెనీపై తాజాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే..?

 

ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ 2024 గ్రాడ్యుయేట్‌ బ్యాచ్‌ ఫ్రెషర్ల నుంచి ఆఫ్‌ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆగస్టు 14వ తేదీని లాస్ట్ డేట్​గా ఈ అప్లికేషన్లకు ఫిక్స్ చేసింది. ఇండియన్‌ టెక్‌ అండ్‌ ఇన్‌ఫ్రా అనే ఎక్స్‌ పేజీ ఈ జాబ్‌ వివరాలను పోస్ట్‌ చేసింది. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్టుపై ప్రస్తుతం నెట్టింట పెద్ద రచ్చ జరుగుతోంది. విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఒక్కరోజులోనే దాదాపు 2 మిలియన్ల వ్యూస్‌ లభించాయి. ఇంతకీ ఆ ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయంటే.. దానికి కారణం ఈ జాబ్ పోస్టింగ్​లో ఫ్రెషర్‌కు ఏడాదికి రూ.2.5 లక్షలు ఇస్తామని పేర్కొనడమే.

ఇది చూసి నెటిజన్లు కాగ్నిజెంట్​పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత తక్కువ ప్యాకేజీనా అంటూ మండిపడుతున్నారు. ‘ఏడాదికి రూ.2.52 లక్షలు అంటే.. నెలకు సుమారు రూ.20వేలు. ఓ పనిమనిషి ఒక్కో ఇంట్లో అరగంట చొప్పున రోజుకు 8-10 ఇళ్లల్లో పనిచేస్తే ఇంతకంటే ఎక్కువ జీవితం వస్తుంది’. అని ఒకరు కామెంట్ చేశారు. మరో యూజరేమో.. ‘ట్యూషన్లు చెప్పినా ఇంతకంటే ఎక్కువ పైసలు వస్తాయి’ అని కామెంట్ పెట్టాడు. ఇక ఇంకో నెటిజన్ అయితే ఏకంగా ఈ జాబ్ కంటే.. ‘వీధిలో తోపుడు బండ్ల వ్యాపారమే నయం.. ఇంకా ఎక్కువ డబ్బులొస్తాయి’ అంటూ రాసుకొచ్చాడు. ‘ఏడాదికి రూ.2.5 లక్షలు అంటే.. ఆ జీతంతో హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో నెల గడవడం చాలా కష్టమంటూ’ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

 

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *